iDreamPost
android-app
ios-app

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. జరిగిన 5 తప్పులు ఇవే

Devara Pre Release Event: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దేవర ప్రీ -రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని నోవాటెల్ లో ప్లాన్ చేయగా అనుకోని పరిస్థితుల కారణంగా రద్దైంది.

Devara Pre Release Event: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దేవర ప్రీ -రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని నోవాటెల్ లో ప్లాన్ చేయగా అనుకోని పరిస్థితుల కారణంగా రద్దైంది.

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. జరిగిన 5 తప్పులు ఇవే

వరల్డ్ వైడ్ గా దేవర ఫీవర్ పట్టుకుంది. ఎక్కడ చూసినా ఏ నోట విన్నా దేవర గురించే చర్చ. యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దేవర. హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తారక్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు దేవర రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్స్ కి, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ రికార్డులపై దేవర దండయాత్ర తప్పదని.. రికార్డు కలెక్షన్లతో దేవర సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుందని అంటున్నారు సినీ పండితులు. ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా దేవర రిలీజ్ కాబోతోంది. థియేటర్లలో మాస్ జాతర కొనసాగబోతోందంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా దేవర విడుదలకు ముందు ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. నిన్న అనగా సెప్టెంబర్ 22న జరగాల్సిన దేవర ఈవెంట్ కొన్ని కారణాల వల్ల రద్దైంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దుకు జరిగిన 5 తప్పులు ఇవే.

చిత్ర యూనిట్ వైఫల్యం:

గతకొన్ని రోజులుగా దేవర బజ్ ఓ రేంజ్ లో ఉంది. ఈ మూవీ నుంచి వస్తున్న ఒక్కో అప్ డేట్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సోలో చిత్రం కావడంతో అంచనాలు అమాంతం పెరిగాయి. దేవర రిలీజ్ కు ముందు ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. హైదరాబాద్‍లోని నోవాటెల్ హోటల్‍లో నిర్వహించాలని మూవీ టీమ్ నిర్ణయించింది. కానీ అక్కడే చిత్ర యూనిట్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్న ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా వేడుకను ఇండోర్ స్టేడియంలో నిర్వహించాలనుకోవడం చిత్ర బృందం చేసిన తప్పు.

అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అంచనా వేయకపోవడం:

దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ అందుకు తగిన ఏర్పాట్లను చేయలేకపోయారు చిత్ర యూనిట్. దేవర వేడుకకు హాజరై తమ అభిమాన నటున్ని చూడాలని, తను ఏం మాట్లాడతాడో వినాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇదంతా ప్రత్యక్షంగా వీక్షించేందుకు నోవాటెల్ కు తారక్ ఫ్యాన్స్ పోటెత్తారు. దీంతో ఈవెంట్ ను నిర్వహించలేని పరిస్థితి తలెత్తింది. ఫ్యాన్స్ తాకిడి ఎక్కువగా ఉంటుందని ముందుగా అంచనా వేయకపోవడం చిత్ర యూనిట్ చేసిన తప్పిదం.

ఇండోర్ స్టేడియంలో నిర్వహణ:

దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. వేలాది మంది అభిమానులు ఈవెంట్ కు హాజరవుతారని తెలిసి కూడా ఇండోర్ స్టేడియంలో నిర్వహించడం ఈవెంట్ రద్దుకు కారణమైంది. ఇండోర్ ఈవెంట్‍కు అంచనాలకు మించి వేలాదిగా అభిమానులు రావటంతో గందరగోళం ఏర్పడింది. ఇండోర్ లో కాకుండా ఔట్ డోర్ లో నిర్వహిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేదికాదంటున్నారు సినీ విశ్లేషకులు.

వేలాదిగా వచ్చిన అభిమానులు:

దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను ప్రత్యక్షంగా తిలకించేందుకు నోవాటెల్ హోటల్ కు తారక్ ఫ్యాన్స్ వేలాదిగా పోటెత్తారు. ఈ ఇండోర్ ఈవెంట్‍కు జనాలు ఊహించిన దాని కంటే చాలా ఎక్కువగా వచ్చారు. పాస్ లు లేకపోయినా 30 వేలకు పైగా అభిమానులు హాజరయ్యారు. చాలాసేపు ఎదురుచూడాల్సి రావటంతో కొందరు అసహనం వ్యక్తం చేశారు. అభిమానులు ఒక్కసారిగా నోవాటెల్ హోటల్‍లోకి దూసుకొచ్చారు. దీంతో గందరగోళం ఏర్పడింది. ఈవెంట్ జరగాల్సిన హాల్ నిండిపోయి చాలా మంది బయటే ఉండిపోవాల్సి వచ్చింది. అంచనాలకు మించి అభిమానులు ఈవెంట్ కు హాజరవ్వడం కూడా వేడుక రద్దవ్వడానికి కారణం అయ్యింది అని చెప్పొచ్చు.

దేవరకి ఇంత హైప్ రావడం:

దాదాపు 5 సంవ్సత్సరాల తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడంతో దేవరపై అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి. హైవోల్టేజ్ యాక్షన్స్ సీన్స్ తో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఖాయం అంటూ టాక్ వినిపించడంతో దేవరకి హైప్ పెరిగింది. సోషల్ మీడియాలో ఎక్కడా చూసిన దేవర గురించే టాక్. దేవర నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ కు మిలియన్ల కొద్ది వ్యూస్ రావడం. ట్రైలర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ రావడం వంటివి దేవరపై అంచనాలను పెంచాయి. దీంతో ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు వేలాది మంది అభిమానులు తరలిరావటంతో మూవీ యూనిట్‍కు కూడా ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈవెంట్ జరిపే పరిస్థితులు ఏ మాత్రం కనిపించలేదు. దీంతో ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను క్యాన్సిల్ చేశారు నిర్వాహకులు.