iDreamPost
android-app
ios-app

థియేటర్ల కాంట్రావర్సీ – దిల్ రాజు ఏమన్నారంటే?

  • Published Nov 28, 2022 | 6:35 PM Updated Updated Nov 28, 2022 | 6:35 PM
థియేటర్ల కాంట్రావర్సీ – దిల్ రాజు ఏమన్నారంటే?

తెలుగు సినిమాలైన వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిల కంటే డబ్బింగ్ మూవీ వారసుడికే పెద్ద రిలీజ్ వచ్చేలా చేస్తున్నారన్న విమర్శలకు దిల్ రాజు ఎట్టకేలకు సమాధానమిచ్చారు. ఒక న్యూస్ ఛానల్ ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్న ఈ అగ్ర నిర్మాత తనవైపు వేలెత్తి చూపిస్తున్న వాళ్లకు గట్టి సమాధానమే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన వెర్షన్ ప్రకారం వారసుడు సంక్రాంతి రిలీజ్ ని ముందు కన్ఫర్మ్ చేసుకుంది. తర్వాత చిరంజీవి డేట్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. డిసెంబర్ లో ప్లాన్ చేసుకున్న బాలకృష్ణ చిత్రాన్ని కారణం ఏదైనా జనవరికి షిఫ్ట్ చేశారు. ఆ రెండు తనకన్నా ఆలస్యంగా ప్రకటనలు ఇచ్చారు కాబట్టి తానెందుకు తప్పుకోవాలన్నది ఫస్ట్ కౌంటర్.

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఒకే అగ్ర నిర్మాణ సంస్థ నుంచి ఇద్దరు టాప్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల కావడం జరగలేదన్నారు. నిజానికిది తప్పు కాదు. బ్యానర్ ఒకటే అయినా హీరోలతో సహా టీమ్ మొత్తం వేరేగా. అలాంటప్పుడు ఏదో ఒకటే వదలండి అని చెప్పే అవకాశం ఉండదు. నైజామ్ లో ఉన్న 37 థియేటర్లతో తానేం మోనోపోలీ చేయగలనని అన్నారు. హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ తాను అరవింద్ నడిపించే సంధ్య తప్ప మిగిలిన సింగల్ స్క్రీన్లు ఓనర్లే చూసుకుంటున్నారని చెప్పారు. బాగానే ఉంది కానీ అందరూ మొదటి ప్రాధాన్యం ఇచ్చే సుదర్శన్ 35 ఎంఎంలో తాను పంపిణి చేసేవి ఎస్విసి నుంచి వచ్చినవి ఎక్కువ రిలీజ్ కావడం గురించి ప్రస్తావన లేదు

మైత్రి అధినేతలతో తనకు మంచి స్నేహం ఉందన్న రాజుగారు తామంతా మామూలుగానే ఉన్నామని బయటే ఏవేవో ఊహించుకుంటున్నారని చెప్పారు. అలాంటప్పుడు వారసుడికి ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ ఇప్పించిన తీరులో తమిళనాడులో చిరు బాలయ్య సినిమాలకూ ఎన్నో కొన్ని మంచి థియేటర్లు వచ్చేలా చేయొచ్చు. తన మీద నమ్మకంతోనే డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ సహకరిస్తున్నారన్న దిల్ రాజు కేవలం ఆ కారణంగా మాకు వీరయ్య, వీరసింహాలు వద్దు వారసుడే కావాలని డిమాండ్ చేశారా. ఇక్కడే లాజిక్ తప్పుతోంది. ఏదైతేనేం మొత్తానికి స్పందనయితే వచ్చింది కానీ మరి దీనికి ఎలాంటి రియాక్షన్లు ఉంటాయో జస్ట్ వెయిట్ అండ్ సి