రాష్ట్రా ఎన్నికల కమిషనర్ కనగరాజ్ కేంద్రంగా తెలుగుదేశం అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం హద్దులు దాటుతోంది. ఆ ప్రచారాన్ని చూస్తే నవ్విపోదురు గాక నాకేంటి అనే తరహాలో ఉంటోంది. తమకు నచ్చని…తమ మనిషి కాని వ్యక్తి ఆ కుర్చీలో కూర్చోవటాన్ని చూసి తట్టుకోలేని ఆ పార్టీ నేతలు, మీడియా విలువలకు తిలోదకాలు ఇచ్చి కట్టు కథనాలు అల్లుతుండటం అత్యంత ఆక్షేపణీయం.
కొత్తగా భాద్యతలు చేపట్టిన ఎన్నికల కమిషనర్ సిబ్బందితో సమావేశమయ్యారు. కొత్తగా ఎవరు భాద్యతలు చేపట్టినా సాధారణంగా జరిగే పక్రియే ఇది. సిబ్బందితో జరిగిన సమావేశంలో కమిషనర్ పంచాయతీరాజ్ వ్యవస్థ, స్థానిక సంస్థల ప్రాధాన్యతల గురించి మాట్లాడారు. రాష్ర్టంలో పరిస్థితులు కుదుటపడ్డాక ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దానికి సన్నద్దంగా ఉండాలని సూచించారు. కానీ, జరిగింది జరిగినట్టు చెప్తే మా పబ్బం గడిచేదెలా అనుకున్నారో ఏమో కమిషనర్ మాటలకు వక్రభాష్యం చెప్పేశారు. అంతటితో ఆగితే మమ్మల్ని ఎల్లో మీడియా అని ఎందుకంటారు అనే డవుట్ వచ్చిందేమో… ఏకంగా మాస్కుల చుట్టూ ఓ కట్టు కథే అల్లేశారు.
వెంటనే ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండండి అని ఆదేశించిన నూతన రాష్ర్టఎన్నికల ప్రధాన అధికారి…రెడ్ జోన్లను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు సిద్దమవుతున్న ప్రభుత్వం… అందుకే మనిషికి మూడు మాస్కుల చొప్పున పంపిణీ….ఇదీ అన్ని కోణాలను స్పృశించే ఓ మీడియా కల్పిత కథనం…! చూస్తుంటే ఔరా ఇంత నిస్సిగ్గుగా కట్టుకథలు ఎలా అల్లుతారో అనిపించట్లేదు. పరిస్థితి చూస్తుంటే రానున్న రోజుల్లో ఎల్లో మీడియా చెప్పే ఇంకెన్ని కాల్పనిక కథలు వినాల్సి వస్తుందో అనే భావన అందరిలో కలుగుతోంది.