మహానాడులో కూడా వీళ్ళ గోలేనా ? ప్రసంగాలంతా వీళ్ళ గురించే

ప్రధాన ప్రతిపక్ష హోదాలో చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై ప్రయోగిస్తున్న అస్త్రాలన్నీ తుస్సుమంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద గుడ్డి వ్యతిరేకతతో చంద్రబాబు పనికిమాలిన ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ అర్ధమైపోతోంది. ఇంతకీ జగన్ సర్కార్ పై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు ఏమిటంటే నర్సీపట్నం డాక్టర్ సుధాకర్, గుంటూరు జిల్లాలో రంగనాయకమ్మ, గుంటూరు జిల్లాలోని ఓ గుడిసెకు 3 వేల రూపాయల కరెంటు బిల్లు వచ్చిందని. నిజానికి ఈ ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజంలేదు. మహానాడులో కూడా చివరకు వీళ్ళ గోలను చంద్రబాబు విడిచిపెట్టలేదు.

ప్రభుత్వ సర్వీసులో ఉన్న వారెవరు కూడా ప్రభుత్వంపై బహిరంగంగా ఆరోపణలు, విమర్శలు చేయకూడదన్నది సర్వీసు నిబంధనల్లోనే ఉంటుంది. అలాంటిది డాక్టర్ ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తర్వాత మళ్ళీ ఈమధ్యనే రోడ్డుపై నానా యాగీ చేస్తుంటే స్ధానికుల ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ సుధాకర్ గురించి తెలిసిన వాళ్ళెవరూ ఆయనకు మద్దతుగా మాట్లాడరని ఆయనతో కలిసి పనిచేసిన ఉద్యోగులే చెబుతున్నారు. అలాంటిది చంద్రబాబు, లోకేష్ డాక్టర్ కు మద్దతుగా ట్విట్టర్లో నానా గోల చేస్తున్నారు.

ఇక రంగనాయకి విషయం చూద్దాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిందని ప్రభుత్వం ఆమెకు నోటీసులిచ్చింది. వెంటనే చంద్రబాబు, లోకేష్ గోల మొదలుపెట్టేశారు ట్విట్టర్లో, మీడియాలో. 66 ఏళ్ళ వృద్ధురాలికి నోటీసులివ్వటం ఏమిటంటూ గట్టిగా ప్రశ్నించేశారు. నిజానికి రంగనాయికి 66 ఏళ్ళ వృద్ధురాలు మాత్రమే కాదు. బలమైన టిడిపి మద్దతుదారు కూడా. చాలా సంవత్సరాలుగా టిడిపిలో క్రియాశీలకంగా పనిచేస్తున్నదట. తమ పార్టీ యాక్టివిస్టన్న విషయాన్ని తండ్రి, కొడుకులు దాచిపెట్టి కేవలం వృద్ధురాలి మీద కేసంటు గోల చేస్తున్నారు.

చివరగా విద్యుత్ బిల్లుల గోల కూడా ఇలాంటిదే. ఎందుకంటే గుంటూరు జిల్లాలో ఓ పూరిగుడిసెకు 3400 బిల్లు వచ్చిందంటూ గోల చేస్తున్నాడు చంద్రబాబు. బిల్లు వచ్చింది వాస్తవమే. కానీ ఆ గుడిసెలో ఉంటున్న వృద్ధురాలు రవ, పిండి ఆడించే గ్రైండర్ నడుపుతోంది. మరి రవ, పిండి ఆడిస్తున్నపుడు విపరీతమైన కరెంటు కాలుతుంది కాబట్టే బిల్లంత వచ్చింది. పైగా తల్లి, కూతురు పక్కపక్కనే ఉంటారు. కూతురుండే పెద్ద ఇంటికి, తల్లుంటున్న గుడిసెకు కలిపి ఒకే మీటర్. అంటే రెండింటి కనెక్షన్లు ఒకే మీటర్ మీద రన్ అవుతోంది. ఆ విషయాన్ని చంద్రబాబు దాచిపెట్టి ఉద్దేశ్య పూర్వకంగానే అబద్ధాలు చెప్పాడు. టిడిపి వాళ్ళు విద్యుత్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయని చెప్పిన ప్రతి ఆరోపణ అధికారుల పరిశీలనలో తప్పని తేలిపోయింది.

ఇలా పనికిమాలిన, పేలవమైన ఆరోపణలు చేస్తు చంద్రబాబు తన స్ధాయిని తానే తగ్గించేసుకుంటున్నాడు. కరోనా వైరస్ కారణంతో ఇంటిల్లిపాదీ ఇంట్లోనే లాక్ డౌన్ అయిపోయిన కారణంగా కరెంటు ఎక్కువగా వాడేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. కరెంటు ఎక్కువగా వాడేస్తే శ్లాబు కూడా మారిపోతుంది కాబట్టి బిల్లు కచ్చితంగా ఎక్కువే వస్తుందన్న చిన్న విషయం కూడా చంద్రబాబుకు తెలీదా ? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక్క చంద్రబాబే కాదు తర్వాత మాట్లాడిన నేతలందరూ పై విషయాలనే ఒకటికి పదిసార్లు ప్రస్తావించారు. అంటే వీళ్ళ వరస చూస్తుంటే జగన్ సర్కార్ పై ఆరోపణలు చేయటానికి ఏమీ లేకనే పై అంశాలను పదే పదే ప్రస్తావించినట్లు

Show comments