రోడ్లపై స్కూటీ, బైక్ పార్క్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!

దొంగలు రోజు రోజుకు తెలివి మీరుతున్నారు. చాక చక్యంగా జన సంచారం మధ్యలోనే డబ్బులు, నగదు దొంగిలించేస్తున్నారు. ముఖ్యంగా రోడ్లపై, పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలను టార్గెట్ చేస్తున్నారు. జనాలు తిరుగుతుండగానే.. దోచేస్తున్నారు.

దొంగలు రోజు రోజుకు తెలివి మీరుతున్నారు. చాక చక్యంగా జన సంచారం మధ్యలోనే డబ్బులు, నగదు దొంగిలించేస్తున్నారు. ముఖ్యంగా రోడ్లపై, పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలను టార్గెట్ చేస్తున్నారు. జనాలు తిరుగుతుండగానే.. దోచేస్తున్నారు.

అరవై నాలుగు కళల్లో చోర కళ ఒకటి అంటుంటారు. ఈ చోర కళలో చోరులు.. పిహెచ్‌డి పట్టాను పొందినట్లు కనిపిస్తున్నారు. ఎందుకంటే రోజు రోజుకూ దొంగలు తెలివి మీరిపోతున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నామా.. దోపిడీ చేసేస్తున్నారు. రాత్రి వేళల్లోనే కాదూ పట్టపగలు.. జనాలు తిరుగుతున్న సమయంలో కూడా చోరీకి పాల్పడుతున్నారు. కించిత్ అనుమానం కూడా రాకుండా దొంగతనం జరుగుతుందంటే.. ఎంతగా ఆరితేరారో అర్థమౌతుంది. టార్గెట్ ఫిక్స్ చేసుకుని, కాపు కాసి, మాటు వేసి.. దొరికినంత దోచుకెళుతున్నారు. కొత్త కొత్త పద్దతులను అనురించి దోపిడీ చేస్తున్నారు. ముఖ్యంగా రోడ్లపై, పార్కింగ్, బహిరంగ ప్రదేశాల్లో ఉంచిన ద్విచక్రవాహనాలపై మాటు వేస్తున్నారు.  ఈ విషయం బాధితులు గ్రహించే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

పార్కింగ్ చేసిన వాహనాల్లో డబ్బు ఉంచి.. భద్రంగా లాక్ వేశామని అనుకుంటే పొరపడినట్లే. చాక చక్యంగా నగదును కొట్టేస్తున్నారు ముఠా.  రోడ్డుపై లేదా పార్కింగ్ ప్లేసులో ఏదైనా విలువైన వస్తువులు, డబ్బులు ఉంచి ద్విచక్ర వాహనాలకు తాళం వేశారా.. హాంఫట్టే. సాధారణ మనుషుల్లాగే, రోడ్డుపై నడుస్తున్న వ్యక్తుల్లాగా.. నలుగురు, ఐదుగురు వస్తారు. మెల్లిగా డబ్బు, నగలు ఉన్న వాహనం దగ్గరకు వెళతారు.. తమ బండిలాగానే మాట్లాడుకుంటారు. చాక చక్యంగా స్కూటీ వెనుక ఉన్న సీటు ఎత్తి.. అందులో ఉన్న మొత్తాన్ని కొల్లగొడతారు. వెంటనే అక్కడే బైకులపై సిద్ధంగా ఉన్న తమ ముఠా వ్యక్తులతో ఉడాయిస్తారు. ఇప్పుడు ఇటువంటి చోరీలకు తెరలేపుతున్నారు దొంగలు.

తాజాగా ఇటువంటి ఘటనే తమిళనాడులో జరిగింది. సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఆ వీడియోలో కొత్త తరహా దొంగతనం బయట పడింది. ఓ వ్యక్తి  స్కూటీపై వస్తూ.. రోడ్డు ప్రక్కన బండి ఆపి.. పనిమీద వెళతాడు. అంతలో అక్కడికి ఇద్దరు వచ్చి.. తమ బండిలా బిల్డప్ ఇస్తారు. వారి ముఠాలో వ్యక్తులు బైకులపై వచ్చి సిద్ధంగా ఉంటారు. అంతలో మెల్లిగా బండి సీటు ఎత్తి.. అందులో ఉన్న నగదు తీసుకుని వాహనాలపై పారిపోతుంటారు. అందుకే బైక్, స్కూటీ వంటి వాహనాలను పార్క్ చేసే సమయంలో విలువైన వస్తువులు, నగదు ద్విచక్రవాహనాల్లో వాటిల్లో భద్రపరచడం సేఫ్ కాదు. ఈ తరహా దొంగతనాలు ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయని తెలుస్తోంది.

v

Show comments