Good Luck Sakhi : పోటీ లేకపోయినా పేచీ తప్పలేదు

ఎల్లుండి విడుదల కాబోయే గుడ్ లక్ సఖి మీద ఏమంత బజ్ కనిపించడం లేదు. ఇవాళ సాయంత్రం చిరంజీవి అతిధిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. తీరా చూస్తే ఆయనకేమో రెండోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. అందుకే ఇప్పుడు రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చి ఆ లోటు తీరుస్తున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. ఈ వేడుక అయ్యాక హైప్ పెరుగుతుందనే అంచనాలో టీమ్ ఉంది. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం చాలా వీక్ గా ఉన్నాయి. స్టార్ వేల్యూ లేకపోవడం, కేవలం కీర్తి సురేష్ కోసమే మొదటిరోజు థియేటర్లో చూద్దామనుకునే అభిమానుల శాతం తక్కువగా ఉండటం లాంటి కారణాలు కనిపిస్తున్నాయి.

సఖికి అసలు కాంపిటీషనే లేదు. గ్యాంగ్స్ అఫ్ 18 అనే డబ్బింగ్ సినిమా, డిఎస్జె దెయ్యంతో సహజీవనం అనే మరో చిన్న చిత్రం తప్ప ఇంకేవీ రేసులో లేవు. ఇంతకన్నా మంచి అవకాశం ఎవరికీ రాదు. ఏపిలో యాభై శాతం ఆక్యుపెన్సీ కంటిన్యూ అవుతున్నా దానివల్ల సఖికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఫుల్ సీటింగ్ తో హౌస్ ఫుల్ బోర్డులు పడేంత సీన్ లేదు కాబట్టి వీటిని నింపుకున్నా అదే పెద్ద అచీవ్ మెంట్ గా చెప్పుకోవచ్చు. ట్రైలర్ కూడా ఏమంత కిక్ ఇవ్వలేకపోయింది. కీర్తి సురేష్ పెర్ఫార్మన్స్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం తప్ప ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశమేమి కనిపించలేదు. పూర్తిగా పాజిటివ్ టాక్ మీదే ఆధారపడటం తప్ప వేరే ఆప్షన్ లేదు.

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఆలోచిస్తాడని పేరున్న నగేష్ కుకునూర్ గుడ్ లక్ సఖికి దర్శకుడు కావడం ప్లస్ అయినప్పటికీ ఈయన గురించి ఇప్పటి మూవీ లవర్స్ కు తెలిసింది తక్కువే. రెగ్యులర్ ఆడియన్స్ కి అవగాహన కూడా లేదు. స్పోర్ట్స్ డ్రామాలు రొటీన్ అవుతున్న తరుణంలో రైఫిల్ షూటింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సఖి ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. వచ్చే నెల మొదటివారం 4వ తేదీ విశాల్ సామాన్యుడు వచ్చే దాకా బాక్సాఫీస్ వద్ద బంగార్రాజు, గుడ్ లక్ సఖిలు మాత్రమే ఆప్షన్లుగా ఉంటాయి. హీరో ఎప్పుడో డౌన్ కాగా రౌడీ బాయ్స్ టీమ్ పట్టువదలకుండా ప్రమోషన్లు చేస్తూనే ఉంది. మునుపటి జోష్ ఎప్పుడొస్తుందో చూడాలి

Also Read : Radhe Shyam : ప్రభాస్ టీమ్ అలాంటి రిస్క్ చేయదు

Show comments