iDreamPost
android-app
ios-app

ప్రభాస్ కల్కిలో ఆ పాత్ర కాదని.. బుజ్జికి డబ్బింగ్ చెప్పాను: కీర్తి సురేష్

  • Published Aug 12, 2024 | 3:59 PM Updated Updated Aug 12, 2024 | 4:04 PM

Keerthy Suresh: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం రఘుతాత మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే వరుస మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కీర్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ కల్కి సినిమాలోని ఓ రోల్ ను రిజెక్ట్ చేశానంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Keerthy Suresh: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం రఘుతాత మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే వరుస మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కీర్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ కల్కి సినిమాలోని ఓ రోల్ ను రిజెక్ట్ చేశానంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

  • Published Aug 12, 2024 | 3:59 PMUpdated Aug 12, 2024 | 4:04 PM
ప్రభాస్ కల్కిలో ఆ పాత్ర కాదని.. బుజ్జికి డబ్బింగ్ చెప్పాను: కీర్తి సురేష్

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే గతేడాది దసరా మూవీతో సూపర్ హిట్ అందుకున్న కీర్తి చాలా రోజుల తర్వాత డిఫరెంట్ కాన్సేఫ్ట్ తో ప్రేక్షకుల ముందకు రాబోతుంది. కాగా, ప్రస్తుతం ఈ చిన్నది రఘుతాత అనే సినిమాలో నటిస్తుంది. ఇక కీర్తి రఘుతాత సినిమా ఈ నెల ఆగస్టు 15వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే.. మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో కీర్తి వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ కల్కి సినిమాలో ఆఫర్ ఓ రోల్ కు ఆఫర్ వచ్చిందని కానీ, దానిని సున్నితంగా తిరస్కరించని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలేంటో చూద్దాం.

తాజాగా కీర్తి సురేష్ ‘రఘుతాత’ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే అక్కడ ప్రభాస్ కల్కి 2898ఏడి సినిమా ఆఫర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ.. ‘ప్రభాస్ కల్కి సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ మొదట నన్ను సంప్రదించారు. కానీ, నేను ఆ పాత్రను చేయలేనని చెప్పాను. కానీ, ఈ ప్రాజెక్టులో భాగం కావాలనుందని మెసేజ్ నాగికి మెసేజ్ చేశాను. అప్పుడు ఆయన నుంచి నాకు కాల్ వచ్చింది. ఈ కల్కి సినిమాలో బుజ్జి రోల్ కు వాయిస్ ఓవర్ ఇవ్వాలని అడిగారు. నాకు మొదట అర్ధం కాలేదు. అందుకే వెంటనే నేను షూట్ లో భాగం కావాల్సిన అవసరం లేదా అని అడిగాను. అప్పుడు ఆయన కేవలం వాయిస్ ఓవర్ ఇస్తే చాలు అన్నారు. దీంతో మొదట అనుకున్న పాత్ర కంటే.. బుజ్జికి వాయిస్ ఓవర్ ఇవ్వడం బెటర్ అనుకోని వెంటనే ఓకే చెప్పేశాను. ఇక ఈ సినిమాలో వాయిస్ ఓవర్ విషయంలో నాగ్ అశ్విన్ నాకెంతో సాయం చేశారు’ అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా.. కల్కి పార్ట్ 2 సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ సినిమాలో కీర్తికి ఇచ్చిన రోల్ ఏమిటనేది ఎక్కడో కూడా వెల్లడించలేదు. కాకపోతే కీర్తికి ఇచ్చినది పెద్ద రోల్ అయింటుందని, కానీ దాన్ని తను పోషించగలనో లేదో అనే సందేహ పడటం కంటే.. బుజ్జి రోల్ న్యాయం చేయగలనని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం కీర్తికి కల్కి మూవీ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరీ, కల్కి సినిమాలో ఓ రోల్ ను రిజెక్ట్ చేశానంటూ కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss