iDreamPost
android-app
ios-app

SIIMA Awards-2024: సైమా అవార్డ్స్ లో నాని మూవీస్ హవా.. ఎన్ని అవార్డులు కొల్లగొట్టాడంటే?

  • Published Sep 15, 2024 | 10:59 AM Updated Updated Sep 15, 2024 | 10:59 AM

SIIMA Awards-2024 Winners List, Nani, Dasara Movie: సైమా అవార్డ్స్ 2024లో న్యాచురల్ స్టార్ నాని సత్తా చాటాడు. బెస్ట్ యాక్టర్ గా అవార్డు దక్కించుకోవడమే కాకుండా.. నాని నటించిన సినిమాలు ఏకంగా 8 అవార్డులు సొంతం చేసుకున్నాయి. మరి సైమా అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

SIIMA Awards-2024 Winners List, Nani, Dasara Movie: సైమా అవార్డ్స్ 2024లో న్యాచురల్ స్టార్ నాని సత్తా చాటాడు. బెస్ట్ యాక్టర్ గా అవార్డు దక్కించుకోవడమే కాకుండా.. నాని నటించిన సినిమాలు ఏకంగా 8 అవార్డులు సొంతం చేసుకున్నాయి. మరి సైమా అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

  • Published Sep 15, 2024 | 10:59 AMUpdated Sep 15, 2024 | 10:59 AM
SIIMA Awards-2024: సైమా అవార్డ్స్ లో నాని మూవీస్ హవా.. ఎన్ని అవార్డులు కొల్లగొట్టాడంటే?

సైమా(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2024) వేడుకలు దుబాయ్ వేదికగా గ్రాండ్ గా ప్రారంభం అయ్యాయి. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇక ఈవెంట్ కు సౌత్ ఇండియన్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. ఇక వేడుకల్లో భాగంగా తొలిరోజు తెలుగు, కన్నడ భాషలకు సంబంధించి 2023లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న చిత్రాలకు అవార్డులను అందజేశారు. ఈ క్రమంలోనే న్యాచురల్ స్టార్ నాని నటించిన సినిమాలు పలు విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టాయి. అలాగే నానికి ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. ఇక ఉత్తమ నటిగా మహానటి కీర్తి సురేష్ నిలిచింది.

సైమా 2024 అవార్డుల్లో న్యాచురల్ స్టార్ నాని సత్తా చాటాడు. ‘దసరా’ మూవీలో నటనకు గాను నానికి ఉత్తమ నటుడి విభాగంలో అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ నటిగా కీర్తి సురేష్ అవార్డు సొంతం చేసుకుంది. అలాగే ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ సైమా అవార్డును గెలుచుకుంది. ఇక కన్నడ మూవీలకు కూడా ఈ సందర్భంగా అవార్డులు ప్రకటించారు. అందులో భాగంగా ‘సప్తసాగరాలుదాటి’ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా రక్షిత్ శెట్టి, నటిగా రుక్మిణి వసంత్ అవార్డులను అందుకున్నారు. ఇక ఈ అవార్డుల్లో నాని నటించిన దసరా, హాయ్ నాన్న చిత్రాలు చెరో నాలుగు విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టాయి. ఇక ఈ వేడుకలో ఫరియా అబ్దుల్లా, శ్రియా, నేహాశెట్టి, శాన్వీ లాంటి అందాల భామలు తమ డ్యాన్స్ లతో ఆకట్టుకున్నారు. కాగా.. మిగతా విభాగాల్లో ఎవరెవరు అవార్డులు దక్కించుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

సైమా 2024 విజేతల లిస్ట్(తెలుగు):

  • బెస్ట్ యాక్టర్  – నాని(దసరా)
  • ఉత్తమ నటి – కీర్తి సురేష్(దసరా)
  • బెస్ట్ డైరెక్టర్ – శ్రీకాంత్ ఓదెల(దసరా)
  • ఉత్తమ చిత్రం – భగవంత్ కేసరి
  • బెస్ట్ సపోర్ట్ యాక్టర్ – దీక్షిత్ శెట్టి(దసరా)
  • ఉత్తమ సహాయ నటి – బేబీ ఖియారా ఖాన్(హాయ్ నాన్న)
  • బెస్ట్ కమెడియన్ – విష్ణు(మ్యాడ్)
  • బెస్ట్ డెబ్యూ యాక్టర్ – వైష్ణవి చైతన్య(బేబీ)
  • ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ – అబ్దుల్ వహబ్(హాయ్ నాన్న, ఖుషి)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ – భువన గౌడ(సలార్)
  • బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ – రామ్ మిర్యాల(బలగం మూవీ, ఊరు పల్లెటూరు సాంగ్)
  • ఉత్తమ పరిచయ నటుడు – సంగీత్ శోభన్ (మ్యాడ్)
  • బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ – శౌర్యువ్(హాయ్ నాన్న)
  • బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ – వైరా ఎంటర్ టైన్ మెంట్స్ (హాయ్ నాన్న)
  • బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) – ఆనంద్ దేవరకొండ (బేబీ)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్) – మృణాల్ ఠాకూర్
  • బెస్ట్ డైరెక్టర్ (క్రిటిక్స్) – సాయి రాజేశ్(బేబీ)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss