iDreamPost
android-app
ios-app

Keerthy Suresh: నేను సింగిల్ అని ఎప్పుడూ చెప్పలేదు.. కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Aug 09, 2024 | 3:51 PM Updated Updated Aug 09, 2024 | 3:51 PM

ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న కీర్తి సురేష్ తనపై వచ్చిన విమర్శల గురించి చెప్పుకొచ్చింది. అలాగే పనిలో పనిగా తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న కీర్తి సురేష్ తనపై వచ్చిన విమర్శల గురించి చెప్పుకొచ్చింది. అలాగే పనిలో పనిగా తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

  • Published Aug 09, 2024 | 3:51 PMUpdated Aug 09, 2024 | 3:51 PM
Keerthy Suresh: నేను సింగిల్ అని ఎప్పుడూ చెప్పలేదు.. కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

కీర్తి సురేష్.. ‘మహానటి’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకుంది. సెలెక్టివ్ గా కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. తాజాగా ఆమె నటించిన ‘రఘు తాత’ మూవీ ఆగస్ట్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. సుమన్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇక మూవీ మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను గట్టిగానే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న కీర్తి సురేష్ తనపై వచ్చిన విమర్శల గురించి చెప్పుకొచ్చింది. అలాగే పనిలో పనిగా తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

“నా మనసుకు నచ్చిన చిత్రాల్లో నటిస్తూ.. వర్క్ విషయంలో ప్రస్తుతం సంతోషంగా ఉన్నాను. అయితే కెరీర్ స్టార్టింగ్ లో నేను యాక్ట్ చేసిన మూవీస్ నిరాశపరిచాయి. దాంతో నాపై తీవ్రమైన ట్రోల్స్, విమర్శలు వచ్చాయి. బహుశా సౌత్ ఇండియాలో ఎక్కువ ట్రోల్స్ ఎదుర్కొన నటిని నేనే కావొచ్చు. ఇక మహానటి మూవీ తర్వాత నాపై ట్రోల్స్ తగ్గాయి. వివరణాత్మక విమర్శలను నేను స్వాగతిస్తాను. కానీ కొంత మంది మాత్రం కావాలనే నెగటీవ్ కామెంట్స్ చేస్తారు. అవి అస్సలు పట్టించుకోను” అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్.

keerthy surech interesting comments about her relationship

ఈ సందర్భంగా పెళ్లి గురించి కూడా మాట్లాడింది. ఇద్దరు వ్యక్తులు ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటూ.. లైఫ్ ను కొనసాగించడమే పెళ్లి అంటూ తనదైన శైలిలో చెప్పింది కీర్తి. ఇక మీరు సింగిల్ గా ఉంటున్నారు, బోర్ కొట్టడం లేదా? అని ప్రశ్నించగా.. “సింగిల్ అని నేనెప్పుడూ చెప్పలేదుగా” అంటూ నవ్వుతూ సమాధానం చెప్పింది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంటే కీర్తి సురేష్ సింగిల్ కాదా? ఎవరితోనైనా డేటింగ్ లో ఉన్నారా? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా.. ‘బేబీ జాన్’ అనే మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ఈ బ్యూటీ. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. మరి కీర్తి సురేష్ లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom