Swetha
బాలీవుడ్ హారో ఇమ్రాన్ హష్మి ప్రదాన పాత్రలో పోషించిన సినిమా గ్రౌండ్ జీరో. ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు తేజస్ ప్రభ విజయ్ దేవ్స్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను BSF ఆఫీసర్ నరేంద్ర నాధ్ ధార్ దూబే నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించారు.
బాలీవుడ్ హారో ఇమ్రాన్ హష్మి ప్రదాన పాత్రలో పోషించిన సినిమా గ్రౌండ్ జీరో. ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు తేజస్ ప్రభ విజయ్ దేవ్స్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను BSF ఆఫీసర్ నరేంద్ర నాధ్ ధార్ దూబే నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించారు.
Swetha
బాలీవుడ్ హారో ఇమ్రాన్ హష్మి ప్రదాన పాత్రలో పోషించిన సినిమా గ్రౌండ్ జీరో. ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు తేజస్ ప్రభ విజయ్ దేవ్స్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను BSF ఆఫీసర్ నరేంద్ర నాధ్ ధార్ దూబే నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. థియేటర్ లో ఈ సినిమా డీసెంట్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మూవీ కథేంటి అనే విషయాలు చూసేద్దాం.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. 2001లో భారత పార్లమెంట్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడి వెనుక మాస్టర్ మైండ్ జైష్-ఈ-మహమ్మద్ అనే ఓ ఉగ్రవాది.. ఘాజి బాబాను మట్టుబెట్టేందుకు చేసిన మిషన్ చుట్టూ ఈ సినిమా కొనసాగుతూ ఉంటుంది. కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కాబట్టి ఈ సినిమాను ఓసారైనా చూసి దాని గురించి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాను దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో రూపొందిచారట మేకర్స్. కానీ అంతగా రన్ అవ్వకపోడంతో కేవలం 10కోట్ల వరకు కలెక్షన్స్ మాత్రమే రాబట్టిందట ఈ మూవీ.
ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ నెల 20 నుంచి ఈ సినిమా ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రానుంది. ఇలాంటి ఓ రియాలిటీ జోనర్ ను ఎక్స్పీరియెన్స్ చేయాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.