iDreamPost
android-app
ios-app

కీర్తి సురేష్ తో సుహాస్ మూవీ! బాగా ఫాస్ట్ గా ఉన్నారు!

  • Published Aug 10, 2024 | 12:05 PM Updated Updated Aug 10, 2024 | 12:05 PM

Suhaash: యంగ్ హీరో సుహాస్, స్టార్ హీరోయిన్ సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ఉప్పు కప్పురంబు. అయితే తాజాగా ఈ మూవీపై హీరో సుహాస్ లేటెస్ అప్ డేట్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Suhaash: యంగ్ హీరో సుహాస్, స్టార్ హీరోయిన్ సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ఉప్పు కప్పురంబు. అయితే తాజాగా ఈ మూవీపై హీరో సుహాస్ లేటెస్ అప్ డేట్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

  • Published Aug 10, 2024 | 12:05 PMUpdated Aug 10, 2024 | 12:05 PM
కీర్తి సురేష్ తో సుహాస్ మూవీ! బాగా ఫాస్ట్ గా ఉన్నారు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నేచురల్ నటనతో, విభన్నమైన కథలతో ఆకట్టుకున్న యంగ్ హీరోల్లో సుహాస్ కూడా ఒకరు. కేవలం షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ కెరీర్ ప్రారంభించిన సుహాస్.. ఆ తర్వాత వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే మొదట చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తునే.. నేడు హీరోగా వెండితెరపై దూసుకుపోతున్నాడు. కాగా, ఇటీవలే అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత సుహాస్.. ఆ తర్వాత ఏ సినిమా కూడా ఇంతవరకు చేయలేదు. కాకపోతే మధ్యలో మహానటి కీర్తి సురేష్ తో ఓ వెబ్ ఫిల్మ్ నటించబోతున్నాడనే సమాచారం వినిపించింది. ఇక ఈ సినిమాకు ‘ఉప్పుడ కప్పురంబు’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఇకపోతే ఈ సినిమాకు డైరెక్టర్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఆ సినిమా పై ఇంతవరకు ఒక్క అప్ డేట్ కూడా రాలేదు. కానీ, తాజాగా హీరో సుహాస్ ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఆ వివరాలేంటో చూద్దాం.

యంగ్ హీరో సుహాస్, స్టార్ హీరోయిన్ సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ‘ఉప్పు కప్పురంబు’. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఈ టైటిల్ పేరుతో సినిమా రాబోతుందనే సమాచారం వచ్చి ఐదు నెలలు కావోస్తుంది. కానీ, ఇంత వరకు ఏ సినిమా గురించి ఇటు సుహాస్ కానీ, కీర్తి సురేష్ కానీ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. పైగా కీర్తి సురేష్ మరోవైపు బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉండటంతో.. ఇప్పటిలో ఈ సినిమా తెరకెక్కలేదంటూ అందరూ లైట్ తీసుకున్నారు. కానీ, తాజాగా ఈ సినిమా గురించి హీరో సుహాస్ లేటెస్ట్ అప్ డేట్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం సుహాస్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Suhas movie with Keerthy Suresh!

ఇక ఆ పోస్ట్ లో సుహాస్ తో పాటు హీరోయిన్ కీర్తి సురేష్ అండ్ మూవీ టీమ్ ఫోటోల్ లు ఉన్నాయి. పైగా ఆ ఫోటోల కింద సుహాస్ ఉప్పు కప్పురంబు సినిమా షూటింగ్ నిన్న రాత్రితో పూర్తి చేసినట్టుగా తెలిపాడు. అంతేకాకుండా.. కీర్తి సురేష్ తో పాటు ఈ సినిమా యూనిట్ అందరితో కలిసి వర్క్ చేయడం ఎంతో బాగుంది అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే.. చిత్ర యూనిట్ కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నట్లు ఆ ఫోటోల్లో కనిపిస్తున్నాయి.

ఇకపోతే ఇంత త్వరగా ఉప్పుకప్పురంబు సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ మీద నమ్మకంతో ఇటు కీర్తి సురేష్, సుహాస్ షూటింగ్ ను పూర్తి చేసుకువచ్చరని చెప్పవచ్చు. కానీ, ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది, ఏమిటి అనే విషయం పై సుహాస్ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. అయితే త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అప్ డేట్ ను అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. అలాగే త్వరలోనే ఇదే జోరుతో మూవీ టీమ్ ప్రమోషన్స్ ను కూడా స్టార్ చేయవచ్చని తెలుస్తోంది. మరీ, ఉప్పుకప్పురంబు సినిమా అప్ డేట్ పై సుహాస్ షేర్ చేసిన పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Suhas (@suhassssssss)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio