iDreamPost
android-app
ios-app

విజయ్ ఆంటోని మూవీలో తెలుగు యాంకర్ కు ఛాన్స్

  • Published Jun 16, 2025 | 1:54 PM Updated Updated Jun 16, 2025 | 1:54 PM

Vijay Antony : విజయ్ నటిస్తూ, నిర్మించిన కొత్త మూవీ ‘మార్గన్’. మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన విజయ్ ఆంటోనీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. . జూన్ 27న ఈ మూవీ థియేటర్స్ లో అడుగుపెట్టబోతుంది. దీనితో మూవీ టీం అంతా ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు. ఇందులో భాగంగా రీసెంట్ గా ఓ తెలుగు యాంకర్ చేసిన ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతుంది.

Vijay Antony : విజయ్ నటిస్తూ, నిర్మించిన కొత్త మూవీ ‘మార్గన్’. మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన విజయ్ ఆంటోనీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. . జూన్ 27న ఈ మూవీ థియేటర్స్ లో అడుగుపెట్టబోతుంది. దీనితో మూవీ టీం అంతా ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు. ఇందులో భాగంగా రీసెంట్ గా ఓ తెలుగు యాంకర్ చేసిన ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతుంది.

  • Published Jun 16, 2025 | 1:54 PMUpdated Jun 16, 2025 | 1:54 PM
విజయ్ ఆంటోని మూవీలో తెలుగు యాంకర్ కు ఛాన్స్

బిచ్చగాడు సినిమాతో తమిళ, తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి పేరు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. హీరోగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా,ఇలా మల్టీ టాలెంటెడ్ అయిన విజయ్ ఆంటోని ఎప్పుడూ ఆడియెన్స్‌ను కొత్త పాయింట్‌తో ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. ఈ క్రమంలో విజయ్ నటిస్తూ, నిర్మించిన కొత్త మూవీ ‘మార్గన్’. మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన విజయ్ ఆంటోనీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జూన్ 27న ఈ మూవీ థియేటర్స్ లో అడుగుపెట్టబోతుంది. దీనితో మూవీ టీం అంతా ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు. ఇందులో భాగంగా రీసెంట్ గా ఓ తెలుగు యాంకర్ చేసిన ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతుంది.

మార్గన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు యాంకర్ అంజలి విజయ్ ఆంటోని టీం ను ఇంటర్వ్యూ చేసింది. ఇందులో చెప్పుకోదగిన విషయం ఏముంది అని అనుకుంటే పొరపాటే. నార్మల్ గా ఇంటర్వ్యూస్ అంటే మూవీ ప్రమోషన్స్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ ఇంటర్వ్యూలో విజయ్ ఏకంగా ఆ యాంకర్ కు తన సినిమాలో నటించే ఆఫర్ ఇచ్చి మరీ వెళ్ళాడు. అసలు మ్యాటర్ ఏంటంటే అంజలి ఇంటర్వ్యూ చేసే క్రమంలో.. విజయ్ ఓ టాస్క్ ఇచ్చారు. ఓ సీన్ చెప్పి అలానే యాక్ట్ చేయమని అన్నారు. దీనితో ఆమె వెంటనే చెప్పింది చెప్పినట్టు చేసేసింది. ఆమె స్పాట్ యాక్టింగ్ కు విజయ్ అండ్ టీం షాక్ అయ్యారు. ఏ మాత్రం లేట్ చేయకుండా విజయ్ అక్కడే ఆమెకు తన నెక్స్ట్ ఫిల్మ్ లో ఇంపార్టెంట్ రోల్ ఇస్తానని అనౌన్స్ చేశారు.

ఇలాంటి సంఘటనలు చాలా రేర్ గా జరుగుతూ ఉంటాయి. టాలెంట్ ఉన్నా సరే ఎంతో మంది అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ టాలెంట్ ను కనబరిచినా ఉపయోగమేమి ఉండదు . కానీ విజయ్ దానిని గుర్తించి యాంకర్ అంజలికి మూవీ ఆఫర్ ఇవ్వడం అనేది.. నిజంగా అభినందించ తగిన విషయం. ఇక మార్గన్ సినిమా విషయానికొస్తే.. మళ్లీ విజయ్ ఆంటోని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్, కొత్త పాయింట్‌ను టచ్ చేశారని ట్రైలర్ ని బట్టి అర్ధమౌతుంది. ఇక మూవీ ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabet