iDreamPost
iDreamPost
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్ధికి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్ స్కూల్ స్థాయిలొ విద్యా మరియు మౌళిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకుని రావాలనే లక్ష్యంతో సీఎం జగన్ ప్రతిష్టామకంగా అమలు చేస్తున్న “మన బడి నాడు నేడు” కార్యక్రమానికి ఇప్పటికే పలువురు ప్రశింశించగా, తాజాగా డిల్లీ డిప్యుటి సీఎం, ఆం ఆద్మీ పార్టి నేత మనీష్ సిసోడియా తన ఫేస్బుక్ ఖాతా నుంచి ముఖ్యమంత్రి జగన్ ని ప్రసంశిస్తూ సందేశాన్ని పొస్ట్ చేశారు.
ఆగస్టులో రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నందున ఎట్టి పరిస్థితుల్లో జూలై చివరి నాటికి పనులన్నీ పూర్తి చెయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్ధులకు కావల్సిన కనీస సదుపాయాలను కల్పించేలా మార్పులకు శ్రీకారం చుట్టింది. తొలి దశలో 15,715 స్కూళ్ల ఈ మార్పులు చెసేలా ప్రణాళికా బద్దంగా ముందుకు వెలుతుంది. ఈ నేపద్యంలో ఇప్పటికే అనేక పాఠశాలల్లో తరగతి గదుల దగ్గర నుండి టాయిలెట్స్ వరకు సమూలంగా మార్చివేసి కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా తయారు చేశారు. అయితే ఈ కార్యక్రమం పై ఇండియా టుడే వార్తా సంస్థ ప్రత్యకంగా కథనాన్న ప్రచురించడంతో ఆ వార్తను చూసిన మనీష్ సిసొడియా ఆ లింక్ ని పోస్ట్ చేసి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పేద విద్యార్ధులు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకుని వస్తున్నఈ విప్లవాత్మకమైన మార్పునకు ధన్యవాదలు తెలిపారు.