nagidream
మీరు గమనిస్తే.. రైల్వే ట్రాక్ మధ్యలో, అలానే పట్టాల చుట్టుపక్కల కంకర రాళ్లు వేస్తారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? దీనికి పలు కారణాలు ఉన్నాయి.
మీరు గమనిస్తే.. రైల్వే ట్రాక్ మధ్యలో, అలానే పట్టాల చుట్టుపక్కల కంకర రాళ్లు వేస్తారు. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? దీనికి పలు కారణాలు ఉన్నాయి.
nagidream
రైలు పట్టాలు భార్యాభర్తల్లా ఎప్పుడూ కలిసుండకపోయినా మనుషులని మాత్రం మనుషులతో కలిపి ఉంచుతున్నాయి. ఈ విషయంలో రైలు పట్టాలకి ఒక ఫోటో తీసి దండేసి దండం పెట్టాలి. దండం ఎప్పుడు పెట్టినా పర్లేదు గానీ ఈ విషయం తెలుసుకోకపోతే నిద్ర పట్టదు. అసలు రైలు పట్టాల మధ్యలో.. రైలు పట్టాల పక్కన కంకర రాళ్లు పేర్చి ఉంటాయి. రైలు పట్టాలను గమనిస్తే ఈ విషయం మీకు అర్థమవుతుంది. రైల్వే సిబ్బంది కూడా ఆ కంకర రాళ్లను సర్దుతూ ఉంటారు. అసలు ఈ కంకర రాళ్లను పట్టాల మధ్యలో అలానే పట్టాల పక్కన ఎందుకు పెడతారు? ఈ కంకర రాళ్లు అలా పెట్టకపోతే ఏమవుతుంది?
రైలు పట్టాలు వేసే ముందు కాంక్రీట్ తో చేసిన దిమ్మలను భూమ్మీద పెట్టి వాటిపై రైలు పట్టాలను అమరుస్తారు. ఇప్పుడంటే కాంక్రీట్ దిమ్మలు వచ్చాయి కానీ ఒకప్పుడు అయితే చెక్కతో చేసినవి పెట్టేవారు. అయితే ఈ దిమ్మల మధ్యలో ఉండే గ్యాప్ లో కంకర రాళ్లు పేరుస్తారు. ఇలా ఎందుకు పేరుస్తారు అంటే.. దిమ్మలు కదలకుండా ఉండడం కోసం. పట్టాలపై రైలు వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు ఆ వేగానికి దిమ్మలు కదులుతాయి. దీని వల్ల పట్టాలు కూడా కదులుతాయి. అందుకే అటూ ఇటూ కదలకుండా పట్టాల మధ్యలో దిమ్మల మధ్య కంకర రాళ్ళని ఫిక్స్ చేస్తారు. దీని వల్ల దిమ్మలు కదలవు.. అలానే పట్టాలు కదలవు. రైలు వెళ్తున్నప్పుడు ప్రమాదం కూడా ఉండదు. ఇక ఎప్పుడైనా వర్షం పడిందనుకోండి.. కంకర రాళ్ళ వల్ల నీళ్లు పట్టాల మీద నిల్వ ఉండకుండా లోపలకి ఇంకిపోతుంది.
వర్షానికి ట్రాక్ కూడా కొట్టుకుపోకుండా ఉంటుంది. అందుకే ఇలా కంకర రాళ్లు వేస్తారు. పట్టాల మధ్య కంకర రాళ్లు వేశారంటే ఓకే యాక్సెప్టెడ్.. కానీ పట్టాలకి అటూ, ఇటూ ఎందుకు వేసినట్టు? అంటే రైలు వేగానికి రైల్వే ట్రాక్ లు ఒకదానితో ఒకటి దూరం జరిగిపోకుండా ఉండడానికి వేస్తారు. ట్రాక్ కి అటూ ఇటూ కంకర రాళ్లు వేయడం వల్ల అవి కదలకుండా ఫిక్స్డ్ గా ఉంటాయి. మరో కారణం ఏంటంటే.. కంకర రాళ్లు వేయడం వల్ల పిచ్చి పిచ్చి మొక్కలు, ముళ్ల మొక్కలు పెరగవు. మామూలుగా భూమ్మీద మనిషి ప్రమేయం లేకుండానే మొక్కలు పెరుగుతుంటాయి. దీని వల్ల వచ్చీ పోయే రైళ్లకు ఇబ్బంది అవుతుంది. అందుకే మొక్కలు, ముళ్ల పొదలు ఎదగకుండా ఉండేందుకు కంకర రాళ్లను ఏర్పాటు చేస్తారు.