iDreamPost
android-app
ios-app

రైలు పట్టాలపై మరోసారి గ్యాస్ సిలిండర్.. లోకో పైల‌ట్ అప్ర‌మ‌త్తంతో..

  • Published Oct 13, 2024 | 4:22 PM Updated Updated Oct 13, 2024 | 4:22 PM

Uttarakhand: ఇటీవల రైలు ప్రమాదాలే లక్ష్యంగా ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు చేస్తున్న కుట్రలను రైల్వే సిబ్బంది పటాపంచలు చేస్తుంది. ముందుగానే ప్రమాదాలు పసిగట్టడంతో ప్రమాదాల నుంచి బయటపడుతున్నారు.

Uttarakhand: ఇటీవల రైలు ప్రమాదాలే లక్ష్యంగా ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు చేస్తున్న కుట్రలను రైల్వే సిబ్బంది పటాపంచలు చేస్తుంది. ముందుగానే ప్రమాదాలు పసిగట్టడంతో ప్రమాదాల నుంచి బయటపడుతున్నారు.

రైలు పట్టాలపై మరోసారి గ్యాస్ సిలిండర్.. లోకో పైల‌ట్ అప్ర‌మ‌త్తంతో..

ప్రపంచంలో అతి పెద్ద ప్రయాణ వ్యవస్థల్లో ఒకటి భారతీయ రైల్వే. దేశంలో ప్రతిరోజూ లక్షల సంఖ్యల్లో ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంటారు. తక్కువ ఖర్చు మాత్రమే కాదు రైలు ప్రయాణం సురక్షితం అని భావిస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. సాంకేతిక లోపాల కారణం కొన్ని అయితే.. మానవ తప్పిదాల వల్ల మరికొన్ని జరుగుతున్నాయి. తాజాగా రైల్వే ట్రాక్ పై సిలిండర్ తీవ్ర కలకం రేపింది. వివరాల్లోకి వెళితే..

ఉత్తరాఖండ్ లోని ధందేరా రైల్వే స్టేషన్ మీదుగా ఓ గూడ్స్ రైలు వెళ్తుండగా రైలు పట్టాలపై ఓ గ్యాస్ సిలిండర్ ను అమర్చి ఉంచారు. అది గమనించిన లోకో పైలట్ అప్రమత్తమైన ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. వెంటనే అధికారులను అప్రమత్తం చేశాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు సిలిండర్ ను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఆ సిలిండర్ ఖాళీదని నిర్ధారించారు. స్థానిక పోలీసులు, జీఆర్పీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ట్రాక్ వెంట సైనికులకు సంబంధించిన ఆర్మీ వాహనాలను తరలిస్తుంటారు. గూడ్స్ రైళ్లను కూడా సైనిక కార్యకలాపాల కోసం ఈ ట్రాక్ ని వినియోగిస్తుంటారు. గ్యాస్ సిలిండర్ లభించిన ప్రదేశం బెంగాల్ ఇంజనీర్ గ్రూప్ అండ్ సెంటర్ కు దగ్గర్లో ఉందని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే గత కొంత కాలంగా ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, బీహార్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో తరుచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. రైల్వే ట్రాక్ పై సిలిండర్, ఇనుప రాడ్లు, ఇసుక దిమ్మెలు, ఇతర సున్నిత వస్తువులు ఉంచడం వల్ల అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ముందుగానే అనుమానిత వస్తువులు గమనించి లోకో పైలట్లు, సిబ్బంది ప్రమాదాల నుంచి బయటపడుతున్నారు. కాన్పూర్ లోని రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పిది. మధ్య ప్రదేశ్ లోని బుర్హాన్ పూర్ లో ఆర్మీ సిబ్బంది ప్రయాణిస్తున్న రైలును పేల్చేందుకు ప్రయత్నాలు జరిగాయి.. రైల్వే ట్రాక్ పై పెలుడు పదార్ధాలను అధికారులు ముందుగానే గుర్తించి ప్రమాదం తప్పించారు. గుజరాత్ లోని బొటాడ్ లో పట్టాలపై ఇనుప ముక్కను ఉంచిన ఇద్దరు వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు. ప్రమాదాల దృష్ట్యా ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు రైల్వే ట్రాకులపై నిఘా పెంచారు.