iDreamPost
android-app
ios-app

తిరుమలలో కరోనా తొలి పాజిటివ్‌ కేసు

తిరుమలలో కరోనా తొలి పాజిటివ్‌ కేసు

ప్రసిద్ధ పుణ్యక్ష్రేత్రం తిరుమలలో కరోనా వైరస్‌ వెలుగుచూసింది. టీటీడీలో పని చేస్తున్న ఓ శానిటరీ ఇన్స్‌పెక్టర్‌కు కరోనా వైరస్‌ సోకిందని నిర్థారణ అయింది. దీంతో తిరుమలలో తొలికరోనా కేసు నమోదైనట్లుగా అధికారులు నిర్థారించారు. సదరు శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ గోవిందరాజుల స్వామి ఆలయంలో పని చేస్తున్నట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన టీటీడీ అవసరమైన చర్యలు చేపట్టింది.

ఈ నెల 8వ తేదీన లాక్‌డౌన్‌ నుంచి ప్రార్థనా మందిరాలను మినహాయించడంతో దేశం వ్యాప్తంగా దేవాలయాలు తెరుచుకున్నాయి. తిరుమలలో ఈనెల 8,9 తేదీల్లో స్థానిక సిబ్బందికి, 10వ తేదీన స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించిన టీటీడీ ఆ మరుసటి రోజు నుంచి దేశ నలుమూలల నుంచి వచ్చే వారికి దర్శన ఏర్పాట్లు చేసింది. రోజుకు ఆరు వేల మందికి స్వామి వారి దర్శనం కల్పించేందుకు కోవిడ్‌ నిబంధనలను అనుసరించి ఏర్పాట్లు చేసింది. భౌతిక దూరం పాటించేలా మార్కింగ్‌లు వేసింది. ప్రతి ఒక్కరికీ మాస్క్‌లు తప్పని సరి చేసింది. నేరుగా కొండకువచ్చే మూడు వేల మందికి, ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్‌చేసుకున్న మరో మూడు వేల మందికి ప్రతి రోజు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు.