iDreamPost
android-app
ios-app

ప్రధాని మోదీ నిర్ణయానికి సోనియా గాంధీ మద్ధతు

ప్రధాని మోదీ నిర్ణయానికి సోనియా గాంధీ మద్ధతు

కరోన వైరస్‌ నియంత్రణ కోసం ప్రధాని మోదీ తీసుకుంటున్న కొన్ని చర్యలకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ మద్ధతు ప్రకటించారు. కరోన వైరస్‌ వ్యాప్తితో దేశంలో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. అన్ని కార్యకలాపాలు నిలిచిపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో నిన్న కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర పతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్, ప్రధాని, మంత్రులు, ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత విధిస్తూ తీసుకున్న నిర్ణయానికి సోనియా మద్ధతు ప్రకటించారు.

ప్రధాని నిర్ణయాన్నిప్రశంసిస్తూ లేఖ రాసిన సోనియా.. ఆర్థిక క్రమశిక్షణ కోసం మరికొన్ని సూచనలు చేశారు. ప్రధాని, మంత్రుల అధికారిక విదేశీ పర్యటనలు రెండేళ్లపాటు నిషేధించాలని సూచించారు. టీవీ, ప్రింట్‌ మీడియాలకు రెండేళ్లపాటు ప్రకటనలు నిలిపివేయాలని సలహా ఇచ్చారు. 20 వేల కోట్ల రూపాయల వ్యయం అయ్యే నూతన పార్లమెంట్‌ నిర్మాణం ప్రాజెక్టును నిలిపివేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్‌ భవనంలోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యకలాపాలు జరుపుకోవచ్చని పేర్కొన్నారు. పీఎం కేర్స్‌ ఫండ్‌కు వచ్చిన విరాళాలు పీఎం రిలీఫ్‌ పండ్‌కు బదిలీ చేయాలని సూచించారు.