Idream media
Idream media
పరిశ్రమలు, పెట్టుబడులపై గత ప్రభుత్వం మాదిరిగా తాను అబద్ధపు మాటలు చెప్పనని, నెలకో దేశం తిరగనని.. ఏదైతే చెబుతానో దానికి కట్టుబడి ఉంటానని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. ఏదైనా చెబితే ఆ మాటల్లో నిజాయతీ, నిబద్ధత ఉండాలని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈ రోజు జరిగిన మన పాలన – మీ సూచన కార్యక్రమంలో సీఎం జగన్ గత ప్రభుత్వం పెట్టుబడులు, పరిశ్రమలపై వ్యవహరించిన తీరును ఎండగట్టారు. సెటైర్లు వేశారు.
20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలంటూ ఒక రోజు, నెలకో విదేశీ పర్యటనతో హడావుడి, 50 వేల కోట్లతో సెమికండక్టర్ పార్క్‌ను నెక్స్ ఆర్బిట్ ఏర్పాటు చేస్తుందంటూ ఒక రోజు, ఎయిర్ బస్ వచ్చేస్తుందని మరో రోజు, బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందని ఒక రోజు, హైపర్ లూప్ వచ్చేస్తుందని మరో రోజు, ఇటీవలే దివాళా తీసిన పీర్ శెట్టి 1500 పడకల ఆస్పత్రి కోసం ఆరు వేల కోట్ల రూపాయలతో వచ్చేస్తున్నారని మరో రోజు.. ఇలా రోజుకో అబద్ధం, గ్రాఫిక్ తాను కూడా చేయడం మొదలు పెడితే న్యాయం ఉండదని సీఎం జగన్ వ్యాఖ్యనించారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ గొప్పలు చెప్పుకునేవారు. దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామనేవారు. అసలు ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే ఏమిటో అర్థం కావడంలేదని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. 2014– 19 వరకూ పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయతీలు 4 వేల కోట్ల రూపాయలు పెడింగ్ బకాయలు ఉన్నాయని, ఇందులో 900 కోట్ల రూపాయలు ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి ఇవ్వాల్సి ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. పరిశ్రమలకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ వన్‌గా ఉందని ఎలా క్లయిమ్ చేసుకుంటారని ప్రశ్నించారు.
చివరి 14 నెలలు డిస్కంలకు 20 వేల కోట్ల రూపాయల బకాయలు గత ప్రభుత్వం పెట్టి వెళ్లిందన్నారు. ఈ దారిలో గత ప్రభుత్వం నడిచిందన్నారు. కానీ అందరూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు. ప్రతి ఏడాది దావోస్ వెళతారు, ప్రతి రెండు నెలలకు విదేశాలకు వెళతారు, చెప్పిందే చెప్పి డబ్బాలు కొడతారు. అబద్ధాలు చెప్పడానికి ఏ మాత్రం వెనుకాడకుండా వారి మీడియా చెబుతుందని ఎద్దేవా చేశారు. ఇవన్నీ తాను చెప్పలేనని, ఏమి చెబుతానో దానికే కట్టబుడి ఉంటానన్నారు. వేదింపులు ఉండవని ఖచ్చితంగా చెబుతున్నానన్నారు.