బరువనుకోలేదు.. బాధ్యతనుకున్నారు..

ప్రజల సుఖఃదుక్కాల్లో పాలుపంచుకునేవాడే నిజమైన రాజు అంటారు. ఈ మాటను ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అక్షరాల నిజం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా వలస కూలీలు, కార్మికుల కష్టాలపై ముఖ్యమంత్రిగానే కాదు మనసున్న వ్యక్తిగా స్పందిస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి ఏపీ మీదుగా మరో రాష్ట్రానికి వెళ్లే వలసకూలీలు, కార్మికుల గురించి మనకెందుకులే బరువు అనుకోలేదు. బాధ్యతగా భావించి వారికి కష్టాలు తీర్చేందుకు ఏ ముఖ్యమంత్రి చేయని ఏర్పాట్లు చేస్తున్నారు.

వలసకూలీలను క్యాంపులకు తరలించి భోజనం, వసతి కల్పిస్తున్న ఏపీ సర్కార్, వారికి ఆర్టీసీ బస్సుల్లో వారి వారి రాష్ట్రాల సరిహద్దుల వరకూ విడిచిపెడుతోంది. భోజనం, పండ్లు, కాళ్లకు చెప్పులు కూడా అందిస్తున్న జగన్‌ సర్కార్‌ ఉచితంగా వారిని బస్సుల్లో తరలిస్తూ వలసజీవుల మన్ననలనే కాదు అందరి ప్రశంసలు పొందుతోంది. తాను మాటల మనిషిని కాదని చేతల మనిషిని అని సీఎం వైఎస్‌ జగన్‌ మరోమారు నిరూపించుకున్నారు. తాజాగా వసల కూలీలను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తరలించేందుకు అవరమయ్యే నిధులు 12.66 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి కేటాయించారు.

ఇతర ప్రాంతాల్లోని వలస కూలీలను స్వరాష్ట్రానికి తీసుకురావడమే కాదు.. ఏపీలో ఉన్న వారిని కూడా వారి వారి స్వగ్రామాలకు పంపేందుకు జగన్‌ సర్కార్‌ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ఏర్పాటు చేసి సహాయ సహకారాలు అందిస్తోంది. శ్రామిక్‌ రైళ్లలో వారిని పంపే ముందు దారి ఖర్చులకు 500 రూపాయల చొప్పున ఇస్తూ తన పెద్దమనసును సీఎం జగన్‌ చాటుకుంటున్నారు.

Show comments