iDreamPost
android-app
ios-app

అన్నకు రాఖీ కట్టేందుకు బయల్దేరిన గర్భిణి.. బస్సులోనే పురిటి నొప్పులు

  • Published Aug 19, 2024 | 1:45 PM Updated Updated Aug 19, 2024 | 1:45 PM

రక్షా బంధన్ సందర్భంగా.. నేడు దేశవ్యాప్తంగా అన్నా చెల్లళ్లు, అక్కా తమ్ముళ్లు ఈ పవిత్రమైన వేడుకను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. తాజాగా అన్నకు రాఖీ కట్టేందుకు బయల్దేరిన బస్సులో బయలుదేరిన ఓ గర్భిణికి అనుకోకుండా పురిటినొప్పులు రావడంతో.. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్‌ బస్సును రోడ్డు పక్కకు ఆపి ఆ మహిళకు ప్రసవం పోసింది.

రక్షా బంధన్ సందర్భంగా.. నేడు దేశవ్యాప్తంగా అన్నా చెల్లళ్లు, అక్కా తమ్ముళ్లు ఈ పవిత్రమైన వేడుకను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. తాజాగా అన్నకు రాఖీ కట్టేందుకు బయల్దేరిన బస్సులో బయలుదేరిన ఓ గర్భిణికి అనుకోకుండా పురిటినొప్పులు రావడంతో.. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్‌ బస్సును రోడ్డు పక్కకు ఆపి ఆ మహిళకు ప్రసవం పోసింది.

  • Published Aug 19, 2024 | 1:45 PMUpdated Aug 19, 2024 | 1:45 PM
అన్నకు రాఖీ కట్టేందుకు బయల్దేరిన గర్భిణి.. బస్సులోనే పురిటి నొప్పులు

దేశవ్యాప్తంగా రక్త సంబంధాలను, అనుబంధాలను పంచుకునేందుకు జరుపుకుంటున్న వేడుక రక్షా బంధన్. అయితే ఈ రక్షాబంధన్ వేడుక అనేది అన్నా చెల్లళ్లు, అక్కా తమ్ముళ్లు అనుబంధానికి ప్రతీకగా నిర్వహిస్తారు. అందుకే ఈ రాఖీ పండుగ అనేది అత్యంత పవిత్రమైన పండుగగా భావిస్తారు. ఇక ఈ రాఖీ పండుగనాడు,. దూర ప్రాంతల్లో, మెట్టినింటిలో  ఉన్న తోబుట్టువులు కూడా తమ సోదురులకు రాఖీ కట్టడానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే  తాజాగా ఓ నిండు గర్భిణి రాఖీ కట్టేందుకు బస్సులో ప్రయాణిస్తుండగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్‌ బస్సును రోడ్డు పక్కకు ఆపి ఆ మహిళకు ప్రసవం పోసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

గద్వాల డిపోకు చెందిన గద్వాల-వనపర్తి రూట్‌ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధనన్‌ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి బయల్దేరింది. కానీ, ఆ బస్సు నాచహల్లి సమీపంలోకి చేరుకోగానే గర్బిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్‌ భారతి బస్సును రోడ్డు పక్కన ఆపేశారు. అయితే  అదృష్టవశాత్తు అదే బస్సులో ఓ నర్సు కూడా అదే బస్సులో ప్రయాణిస్తోంది. దీంతో ఆమె సాయం తీసుకున్న కండక్టర్ భారతి..  ఆ గర్భిణికి పురుడు పోశారు. దీంతో ఆ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను మెరుగైన చికిత్స కోసం 108 సాయంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.

అయితే రక్షా బంధన్‌ పర్వదినం రోజు బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్‌ భారతికి TGSRTC యాజమాన్యం తరపున సంస్థ ఎండీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. అంతేకాకుండా.. ఆమె సమయస్పూర్తితో వ్యవహారించి నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని ప్రశంసించారు. అలాగే ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూనే, సామాజిక బాధ్యతగా సేవాస్ఫూర్తిని ఆర్టీసీ ఉద్యోగులు చాటుతుండటం గొప్ప విషయమన్నారు. ఇకపోతే బస్సులో గర్భిణీకి పురుడుపోసిన కండక్టర్‌ తన గొప్ప మనసును చాటుకున్నారని పలువురు నెటిజన్లు ప్రశంసలు కురుపిస్తున్నారు. పైగా పండగ రోజు బస్సులో మహాలక్ష్మీ పుట్టిందని అంటున్నారు. మరీ, అన్నకు రాఖీ కట్టాడానికి వెళ్లి బస్సులో పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళకు, మహిళ కండక్టర్ పురుడు పోయ్యడం పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.