iDreamPost
android-app
ios-app

రాఖీ రోజున బస్సులో జన్మించిన చిన్నారి.. TGSRTC గొప్ప నిర్ణయం

  • Published Aug 20, 2024 | 10:03 PM Updated Updated Aug 21, 2024 | 8:13 AM

 గ‌ద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సులో రాఖీ పౌర్ణమి రోజున జ‌న్మించిన చిన్నారికి టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం తాజాగా ఓ బంఫర్‌ ఇచ్చింది.  అంతేకాకుండా.. ఆ హిళకు పురుడుపోసి మానవత్వం చాటుకున్న మహిళ కండక్టర్‌ తో పాటు నర్సుకు కూడా అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చింది.

 గ‌ద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సులో రాఖీ పౌర్ణమి రోజున జ‌న్మించిన చిన్నారికి టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం తాజాగా ఓ బంఫర్‌ ఇచ్చింది.  అంతేకాకుండా.. ఆ హిళకు పురుడుపోసి మానవత్వం చాటుకున్న మహిళ కండక్టర్‌ తో పాటు నర్సుకు కూడా అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చింది.

  • Published Aug 20, 2024 | 10:03 PMUpdated Aug 21, 2024 | 8:13 AM
రాఖీ రోజున బస్సులో జన్మించిన చిన్నారి.. TGSRTC గొప్ప నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలోని రాఖీ పౌర్ణమి పర్వదీనాన (ఆగస్టు 19)  సంధ్య అనే మహిళ ఆర్టీసీ బస్సులో చిన్నారికి జన్మించిన విషయం తెలిసిందే. అయితే గర్భిణీగా ఉన్న ఆ మహిళ రక్షాబంధనన్‌ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు గద్వాల-వనపర్తి రూట్‌ పల్లె వెలుగు బస్సులో సోమవారం ప‍్రయాణం చేస్తుండగా.. పురిటినొప్పులు రావడంతో అదే బస్సులో ఉన్న మహిళ కండక్టర్‌ ఆమెకు పురుడు పోసిన విషయం తెలిసిందే. అయితే ఆర్టీసీ బ‌స్సులో జ‌న్మించిన ఆ చిన్నారికి టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం తాజాగా  అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఇంతకీ అదేమిటంటే..

గ‌ద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సులో రాఖీ పౌర్ణమి రోజున జ‌న్మించిన చిన్నారికి టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం బంఫర్‌ ఇచ్చింది.   రాష్ట్రవ్యాప‍్తంగా ఆ చిన‍్నారి జీవిత కాలం పాటు ఉచితంగా ప్రయాణించేలా బస్‌ పాస్‌ అందిస్తు‍న్నట్లు  టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.  అయితే ఇలా ఆర్టీసీ బస్సుల‍్లో, బస్‌ స్టేషన్‌ లో పుట్టిన ప్లికు జీవిత కాలం ఉచిత బస్ పాస్‌ను ఇవ్వడం కొత్తేమీ కాదు. ఎందుకంటే.. గతంలో కూడా చాలాసార్లు ఆర్టీసీ బస్సులో పుట్టిన ఆడపిల్లలకు ఈ ఆఫర్‌ ను అందించిన విషయం తెలిసిందే.

ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఆ బస్సులో మహిళకు పురుడుపోసి మానవత్వం చాటుకున్న గ‌ద్వాల డిపోన‌కు చెందిన కండ‌క్టర్ భార‌తి, డ్రైవ‌ర్ అంజిల‌తో పాటు న‌ర్సు అలివేలు మంగ‌మ్మను హైదరాబాద్ బస్ భవన్‌లో మంగ‌ళ‌వారం (ఆగస్టు 20వ తేదీన) టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం అభినందించింది. ముఖ్యంగా సంస్థ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వారిని ఘనంగా సన్మానించి.. న‌గ‌దు బ‌హుమ‌తులు అంద‌జేశారు. అనంత‌రం డీల‌క్స్, సూప‌ర్ ల‌గ్జరీ బ‌స్సుల్లో ఏడాది పాటు ఉచితంగా ప్రయాణించే బ‌స్ పాస్‌ను న‌ర్సు అలివేలు మంగ‌మ్మకు, చిన్నారి ఉచిత బ‌స్ పాస్‌ను గ‌ద్వాల డిపో మేనేజ‌ర్ ముర‌ళీకృష్ణకు అంద‌జేశారు.

అలాగే సమయస్పూర్తితో వ్యవహారించి.. సకాలంలో కాన్పు చేసిన కండ‌క్టర్ భార‌తి, న‌ర్సు అలివేలు మంగ‌మ్మ, డ్రైవ‌ర్ అంజి  చేసిన సేవలకు  గాను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రశంసించారు. అంతేకాకుండా.. ఆపద సమయంలో సేవాతర్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం గొప్ప విషయమన్నారు. దీంతో పాటు  ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు.. వారి ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తుండటం అభినందనీయమని సజ్జనార్ ప్రశంసించారు. మరీ, రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఉచితంగా ప్రయాణించేలా బస్‌ పాస్‌ అందించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.