iDreamPost
android-app
ios-app

RTC బస్సుని అందంగా ముస్తాబు చేసి..కన్నీటి వీడ్కోలు పలికారు! ఎక్కడో తెలుసా?

  • Published Sep 19, 2024 | 1:49 PM Updated Updated Sep 19, 2024 | 1:49 PM

RTC Bus: సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో బస్సు సౌకర్యాలు చాలా రేర్ గా ఉంటాయి. ఒకవేళ బస్సు సౌకర్యం ఉంటే.. గ్రామస్థుల సంతోషానికి అవధులు ఉండం. నిత్యం పట్టణాలకు వెళ్లేవారికి బస్సు ఎంతో అనుకూలంగా ఉంటుంది.. అందుకే గ్రామస్థులకు బస్సుతో ఒక రకమైన అనుబంధం, ఎమోషన్ ఉంటుంది.

RTC Bus: సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో బస్సు సౌకర్యాలు చాలా రేర్ గా ఉంటాయి. ఒకవేళ బస్సు సౌకర్యం ఉంటే.. గ్రామస్థుల సంతోషానికి అవధులు ఉండం. నిత్యం పట్టణాలకు వెళ్లేవారికి బస్సు ఎంతో అనుకూలంగా ఉంటుంది.. అందుకే గ్రామస్థులకు బస్సుతో ఒక రకమైన అనుబంధం, ఎమోషన్ ఉంటుంది.

RTC బస్సుని అందంగా ముస్తాబు చేసి..కన్నీటి వీడ్కోలు పలికారు! ఎక్కడో తెలుసా?

ఒకప్పటితో పోల్చుకుంటే నేటి సమాజంలో రవాణా వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. సాధారణంగా దేశానికి హైవేలు ఎంత ముఖ్యమో.. ప్రతి గ్రామానికి రవాణా సేవ అంతే ముఖ్యం అంటారు. ఆసుపత్రులు, చదువు,నిత్యావసర సరుకులు తదితర కారణాలతో పట్టణంపై ఆధారపడే గ్రామాలకు బస్సు సౌకర్యం తప్పని సరి అయ్యింది. ఎక్కడో కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు మినహాయిస్తే చాలా గ్రామాల్లో బస్సులు అందుబాటులోకి వచ్చాయి. గ్రామాల్లో బస్సు వచ్చిందంటే తెగ సంబరపడిపోతుంటారు.. ఆ బస్సుతో ఒకరమైన అనుబంధం ఏర్పర్చుకుంటారు. 15 ఏళ్లుగా నిరంతరం సేవలందించిన ఆర్టీసీ బస్సుకు తన సేవలు ముగించుకుంది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ అరుదైన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

గుజార్ వెళ్లే ఆర్టీసీ బస్సుకు గ్రామస్థులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ అరుదైన ఘటన ధార్వాడ్ జిల్లా కుందగోళ తాలూకాలోని అల్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పూలు, ముగ్గులతో పూజలు చేసిన అనంతరం బస్సుకు వీడ్కోలు పలికారు. గుజారి బస్సుకు వీడ్కోలు చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ గ్రామానికి 2008 లో మొదటిసారిగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సును ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ బస్సుల అక్కడ సేవలు అందిస్తుంది. గత 15 ఏళ్ల నిరంతర సర్వీసు అందిస్తూ గ్రామస్థుల కుటుంబంలో ఒకటిగా మారిపోయంది. బస్సు హారన్ వినిపిస్తే చాలు చిన్నా పెద్ద ఏమోషన్ అయ్యేవారు. రోజూ సాయంత్రం గ్రామానికి రావడం.. అక్కడే నైట్ హాల్ చేయడం.. తిరిగి ఉదయం ప్రయాణికులను ఎక్కించుకొని బయలుదేరడం.. ఇలా 15 ఏళ్లు గడిచిపోయాయి. అందుకే ఆ బస్సు అంటే గ్రామస్థులకు వల్లమాలిన అభిమానం.

2008 నుంచి ప్రారంభం అయిన ఈ బస్సు సేవలు హుబ్లీ నుంచి అల్లాపూర్, కడపటి, హలియా గ్రామాలకు అనుబంధంగా లింక్ ఉంది.నిత్యం మూడు గ్రామాలకు చెందిన కూలీలు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు హూబ్లీ తో పాటు పలు ప్రాంతాలకు వెళ్లేవారు. ఈ బస్సులో వెళ్లి విద్యాబద్దులు నేర్చుకున్న కొంతరు పెద్ద పెద్ద పోస్టుల్లో పనిచేస్తున్నారు. అందుకే ఈ బస్సుతో చాలా మందికి విడదీయరాని అనుబంధం ఏర్పడింది. గత 15 ఏళ్లుగా ఈ బస్సు సుమారు 11.80 లక్షల కిలో మీటర్లు మేర తిరిగింది. ఈ బస్సు రిటైర్మెంట్ అంటే గ్రామస్థులు ససేమిరా అంటున్నారు. కానీ తప్పని సరి పరిస్థితిలో గ్రామస్థులు బస్సు ముందు ముగ్గులు వేసి. బస్సు డ్రైవర్, కండెక్టర్ ని ఘనంగా సన్మాచించారు.