iDreamPost
android-app
ios-app

వీడియో: వాగులో చిక్కుకున్న RTC బస్సు! కాపాడంటూ ప్రయాణీకుల ఆర్తనాదాలు!

  • Published Sep 01, 2024 | 12:47 PM Updated Updated Sep 01, 2024 | 12:47 PM

warangal district: ఇప్పటికే భారీ వర్షాల కారణంగా వాగులు, నదులు, చెరువులు పొంగిపోయి రహదారులన్ని జలమైయమవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అయితే వరుణుడు ప్రజలను వణికిస్తున్నడనే చెప్పవచ్చు. తాజాగా వరంగల్‌ లోని వాగు నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ ప్రయాణికులు తమని కాపాడమని ఆర్తనాదాలు పెట్టుకున్నారు.

  • Published Sep 01, 2024 | 12:47 PMUpdated Sep 01, 2024 | 12:47 PM
వీడియో: వాగులో చిక్కుకున్న RTC బస్సు! కాపాడంటూ ప్రయాణీకుల ఆర్తనాదాలు!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఎంతటి భీభత్సం సృష్టిస్తున్నయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ప్రాంతల్లో చూసిన కుండపోత వర్షాల కారణంగా వాగులు, నదులు, చెరువులు పొంగిపోయి రహదారులన్ని జలమైయమవుతున్నాయి.ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అయితే వరుణుడు ప్రజలను వణికిస్తున్నడనే చెప్పవచ్చు.

కాగా, ఇప్పటికే భారీ వర్షాల కారణంగా రాయపర్తి మండలం మొరిపిరాల శివారులో జాతీయ రహదారిపై చెట్టు విరిగిపోయి రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపఫథ్యంలోనే తాజాగా వరంగల్ జిల్లా తోపనపల్లి వద్ద ఆర్టీసీ బస్సు వరదనీటిలో చిక్కుకుపోవడంతో ప్రయాణికులు కాపాడమంటూ అర్తనాధాలు పెట్టుకున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

వరంగల్ జిల్లా తోపనపల్లి వద్ద ఆర్టీసీ బస్సు వరదనీటిలో చిక్కుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. అయితే ఈ ఆర్టీసీ బస్సు వేములవాడ నుంచి మహబూబాబాద్ కు శనివారం రాత్రి బయల్దేరింది. కానీ, వరంగల్ జిల్లా వెంకటాపురం-తోపనపల్లి వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. మధ్యలోనే బస్సు నిలిచిపోయింది. దీంతో  దాదాపు 10 గంటలుగా బస్సులోని ప్రయాణికులు తీవ్ర  అవస్థలు పడ్డారు.  కనీసం   తాగడానికి మంచినీళ్లు కూడా లేక బస్సులో ఉన్న చిన్నారులు చాలా ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇక ఆ వీడియోలో ప‍్రయానికులు రాత్రి నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నమని వెంటనే అధికారులు స్పందించి తమను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలని కోరుతున్నారు.