iDreamPost
android-app
ios-app

వీడియో: వరద నీటిలో చిక్కుకున్న RTC బస్సు..ఆందోళనలో ప్రయాణికులు!

సోమవారం మధ్యాహ్నం సమయంలో  తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాన దంచికొట్టింది. అలానే నిజామాబాద్ జిల్లాలో సైతం కుండపోత వాన కురిసింది.  ఈక్రమంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వరద నీటిలో చిక్కుకుంది.

సోమవారం మధ్యాహ్నం సమయంలో  తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాన దంచికొట్టింది. అలానే నిజామాబాద్ జిల్లాలో సైతం కుండపోత వాన కురిసింది.  ఈక్రమంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వరద నీటిలో చిక్కుకుంది.

వీడియో: వరద నీటిలో చిక్కుకున్న RTC బస్సు..ఆందోళనలో ప్రయాణికులు!

సోమవారం  అకస్మాత్తుగా వాన కురిసింది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.  హైదరాబాద్ నగరంలో దాదాపు రెండు గంటల పాటు భారీ వాన కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అలానే చాలా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉదయం నుంచి నల్లటి మేఘాలతో నగరమంతా కపేసింది. మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా ఓ రేంజ్ లో వాన ప్రారంభంది. ఇది ఇలాంటి నిజామాబాద్ లో సైతం భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో ఓ  ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. బస్సు చుట్టూ వరద నీరు చేరుకోవడంతో.. అందులోని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సోమవారం మధ్యాహ్నం సమయంలో  తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాన దంచికొట్టింది. అలానే నిజామాబాద్ జిల్లాలో సైతం కుండపోత వాన కురిసింది.  ఈ క్రమంలోనే పట్టణంలోని పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఇక ఈ భారీ వాన ధాటికి పట్టణంలోని రైల్వే  అండర్ బ్రిడ్జ్​ కింద భారీగా వరద నీరు ప్రవహిస్తోంది.   ఇదే సమయంలో అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వరదనీటి మధ్యలో చిక్కుకుంది.  బస్సు ఇరువైపు భారీగా వరద నీరు చేరడంతో  అందులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.

ఇక వరద నీటిలో చిక్కుకున్న బస్సు ముందుకు, వెనక్కి ఎటు కదల్లేని స్థితిలో ఉంది. వెంటనే అప్రమత్తమైన సదరు బస్సు డ్రైవర్…పోలీసులుకు సమచారాం అందిచాడు. వెంటనే పోలీసులు వరదల నీటిలో చిక్కుకున్న బస్సు వద్దకు చేరుకున్నారు. విపత్తు నిర్వహణ బృందం  సాయంతో  బస్సులోని ప్రయాణికులను పోలీసులు రక్షించారు. సోమవారం కుండపోత వాన కారణంగా ప్రధాన  రహదారులు  సైతం చెరువులను తలపిస్తున్నాయి. నిజామాబాద్​ లో 7 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు అయిందని సమాచారం. మొత్తంగా ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం.