iDreamPost
android-app
ios-app

సీఎం జగన్‌ ప్రణాళిక అదిరింది

సీఎం జగన్‌ ప్రణాళిక అదిరింది

నాడు – నేడు అనే వినూత్న కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టిన సీఎం జగన్‌.. ఇందులో భాగంగా మరో ముందడుగు వేశారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమాన్ని అమలు చేయడం ప్రారంభించగా.. తాజాగా వైద్యశాఖలో నాడు నేడు కార్యక్రమానికి కర్నూలు వేదికగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వైద్యశాఖలో చేపట్టబోయే నాడు – నేడు కార్యక్రమాల ప్రణాళికను వెల్లడించారు.

– ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ ప్రమాణాల స్తాయికి ప్రభుత్వాస్పతులు తీసుకొచ్చేలా చర్యలు

– నాడు – నేడు కింద మూడేళ్లలో ప్రాధమిక ఉప కేంద్రాల నుంచి బోధనాస్పత్రుల వరకు అభివృద్ధి.

– మూడు దశల్లో నాడు – నేడు కార్యక్రమం అమలు. 15,337 కోట్ల రూపాయలు ఖర్చు.

– మొదటి దశలో ప్రాథమిక ఉప ఆరోగ్యకేంద్రాల అభివృద్ధి. కొత్తగా 4,906 కేంద్రాల నిర్మాణం, ఇప్పటికే ఉన్న 2,582 కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన. ఇందు కోసం 1129 కోట్ల రూపాయలు కేటాయింపు.

– రెండో దశలో ప్రాధమిక, సామాజిక, ఏరియా ఆస్పత్రులపై దృష్టి. 1145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు గాను 149 నూతన భవనాల నిర్మాణం. మిగతావాటిలో మరమ్మత్తులు.

– 1212 కోట్ల రూపాయలతో 169 సామాజిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి.

– 700 కోట్ల రూపాయలతో 52 ఏరియా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన.

– మూడో దశలో జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రుల అభివృద్ధి.

– ప్రస్తుతం ఉన్న 11 మెడికల్‌ కాలేజీలకు అదనంగా 16 కొత్త కాలేజీల ఏర్పాటుకు చర్యలు. ప్రతి పార్లమెంట్‌లో ఒక మెడికల్‌ కాలేజీ ఉండాలన్నదే లక్ష్యం.

– 16 కొత్త మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా 16 నూతన నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటు.

– నూతనంగా 8 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు.

– మూడు కేన్సర్‌ ఆస్పత్రుల నిర్మాణం.