Idream media
Idream media
పరిపాలనను సరికొత్త పుంతలు తొక్కిస్తూ ప్రజలకు ప్రభుత్వాన్ని దగ్గరకు చేర్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో చరిత్రకు నాంధి పలికారు. దేశ చరిత్రలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లతో పోల్చిన సీఎం జగన్.. తాను ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నానని నిరూపిస్తున్నారు. విశ్వసనీయతకు సరికొత్త అర్ధాన్ని ఇస్తూ పాలన సాగిస్తున్నారు.
ఇచ్చిన హమీలను అమలు చేయకుండా ఉండేందుకు రకరకాల కారణాలు వెతికే కొంత మంది పాలకులను ఇప్పటి వరకూ చూశాం. కానీ ప్రస్తుత కరోనా సమయంలో ఆదాయం లేదు, పానల సాగించడమే కష్టంగా ఉందనే సాకులు చెప్పకుండా ఏడాది వరకూ అమలు చేయబోయే పాత, కొత్త పథకాలను తేదీలతో సహా వెల్లడించిన సీఎం జగన్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
ఇదీ క్యాలెండర్…
మే 26 – అర్చకులు, పాస్టర్లు, మౌజం లకు 5 వేల రూపాయల ఆర్థికసాయం
మే 30 – రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం, గ్రామాల ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చనున్న రైతు భరోసా కేంద్రాలు
జూన్ 4 – వైస్సార్ వాహన మిత్ర ద్వారా సొంత ఆటో ఉన్న ఉన్న కార్మికుడికి ఆర్థిక సహాయం
జూన్ 10 – షాపు ఉన్న నాయుబ్రహ్మణులకు, రజకులకు, టైలర్లకు 10 వేలు ఆర్థిక సాయం
జూన్ 17 – మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు వైస్సార్ నేతన్న హస్తం అందజేత
జూన్ 24 – వైస్సార్ కాపునేస్తాం
జూన్ 29 – చిన్న ,మధ్యతరహా పరిశ్రమలకు సంభందించి రెండో విడత 450 కోట్లు విడుదల
జులై 1 – ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం 1060 క్రొత్తగా కొన్న 104 ,108 అంబులెన్సెలు ప్రారంభం.
జులై 8 – వైస్సార్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు 27 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ
జులై 29 – రైతులకు వడ్డిలేని రుణాలు
ఆగస్టు 3 – వైస్సార్ విద్యా కానుక ద్వారా విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులు, బెల్టు, షూలు, సాక్స్ లు పంపిణీ
ఆగస్టు 9 – గిరిజన దినోత్సవం సందర్భంగా గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ
ఆగస్టు 12 – వైస్సార్ చేయూత
ఆగస్టు 19 – వైస్సార్ వసతి దీవెన
ఆగస్టు 26 – హౌసింగ్ ఇళ్ల నిర్మాణం ,ఇల్లు లేని పేదలకు 15 లక్షల వైస్సార్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభం
సెప్టెంబర్ 11 – వైస్సార్ ఆసరా
సెప్టెంబర్ 25 – వైస్సార్ విద్యా దీవెన ప్రారంభం
ఆక్టోబర్ లో రెండో విడత రైతు భరోసా, ప్రతి రైతు కుటుంబానికి 4 వేలు పంపిణీ
అక్టోబరు లో హకర్స్ కు ఆర్థిక సాయం, గుర్తింపు కార్డు ఉన్న10 లక్షల చిరు వ్యాపారులకు సున్న వడ్డీకే 10 వేల రూపాయల రుణం.
డిసెంబరులో అగ్రిగోల్డ్ బాధితులకు ఆర్థిక సాయం
2021 జనవరి లో రెండో విడత అమ్మఒడి
2021 జనవరిలో చివరి విడత రైతుభరోసా 2 వేలు అందజేత
2021 ఫిబ్రవరి – విద్యా దీవెన మూడో త్రైమాసికం, రెండోదఫా వసతి దీవెన
2021 మార్చి – పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు.