SNP
HYDRA, CM Revanth Reddy, Bhagavad Gita: హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలు, చెరువులను ఆక్రమించి కట్టిన భవనాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసందే. ఈ కూల్చివేతలకు భగవద్గీత స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన అలా ఎందుకన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
HYDRA, CM Revanth Reddy, Bhagavad Gita: హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలు, చెరువులను ఆక్రమించి కట్టిన భవనాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసందే. ఈ కూల్చివేతలకు భగవద్గీత స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన అలా ఎందుకన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
హైదరాబాద్ మహానగరంలో ‘హైడ్రా’(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ప్రకంపనలు సృష్టిస్తోంది. చెరువులను ఆక్రమించి, అక్రమంగా భవనాలు నిర్మించిన వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది హైడ్రా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనతో.. ఏవీ రంగనాథ్ కమిషనర్‌గా ఒక పవర్‌ఫుల్ ఏజెన్సీని ఏర్పాటైంది హైడ్రా. నగరంలో ఆక్రమణకు గురైన చెరువులను, నాలాలను, కుంటలను పునరుద్ధరించే పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతోంది. అందులో భాగంగా.. ఇటీవల మాధాపూర్‌లోని ఎన్ కన్వెషన్‌ను కూల్చేశారు. అలాగే మరికొన్ని కూల్చివేతలు కూడా చేపట్టారు. ఈ కూల్చివేతలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
కేవలం వేరే పార్టీల నేతలు, సెలబ్రెటీలు ఆస్థులనే కాకుండా.. కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకుల నిర్మాణాలను కూడా కూల్చేస్తారా? లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. వీటిపై తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. ఈ హైడ్రా కూల్చివేతలతో కొంతమంది మిత్రులకు ఇబ్బంది కలిగినా.. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. కూల్చివేతలు ఆపే ప్రసక్తే లేదని అంటున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ నగరానికి దాహార్తి తీర్చింది.. గండిపేట, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి నగరానికి తాగునీరు అందుతోంది. కోట్ల మంది ప్రజల దాహార్తి తీర్చే ఈ జలాశయాల పక్కనే కొంతమంది శ్రీమంతులు ఫామ్‌హౌజ్‌ల పేరిట విలాశవంతమైన భవనాలు నిర్మించుకొని.. వాటి నుంచి వచ్చే డ్రైనేజీ నీటిని తాగు నీటి జలయాశాల్లోకి వదులుతున్నారు.
వాళ్ల విలాసవంతమైన జీవితాల కోసం.. ఫామ్‌హౌజ్‌లు నిర్మించుకొని, వాటి నుంచి వచ్చే డ్రైనేజీ నీటిని.. మంచినీళ్లలో కలుపుతూ.. అవే నీళ్లను హైదరాబాద్ నగరంలో నివసించే ప్రజలకు సరఫరా చేస్తుంటే.. అడ్డుకోకపోతే నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టా కాదా?’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అందుకే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. మిత్రులకు ఫామ్ హౌజ్‌లు ఉన్నా.. ఏవీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి.. తెలియకుండానే ప్రజా ప్రతినిధులం కొన్ని తప్పులు చేస్తున్నాం.. వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే కొన్ని మంచి పనులుచేయాలి, అలాంటి మంచిలో భాగంగానే.. చెరువులను చెరబట్టిన వారి నుంచి.. చెరువులను రక్షించి, అందులో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చి.. వారిపై ఉక్కుపాదం మొపుతూ.. ఎలాంటి ఒత్తిడి వచ్చినా.. చెరువులను రక్షించాలనే లక్ష్యంతోనే ఈ అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాం.. దీనికి భగవద్గీతనే స్ఫూర్తి అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మరి సీఎం వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
నాగార్జున కు లైవ్ లో సారీ చెప్పిన రేవంత్ రెడ్డి గారు pic.twitter.com/g7o92qUwId
— MC RAJ🕊️ (@BeingMcking_) August 26, 2024