iDreamPost
android-app
ios-app

భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీ ప్రమాణ స్వీకారం.. సెల్యూట్ చేస్తున్న భారతీయులు

Indian-Origin UK MP Shivani Raja Took Oath On Bhagavad Gita: పాశ్చాత్య మోజులో పడి మన ఆచారాలు, వ్యవహారాలను గాలికొదిలేస్తున్న ఈరోజుల్లో.. విదేశాల్లో స్థిరపడి కూడా భారతీయ మూలలను అక్కడ ప్రతిధ్వనించేలా చేస్తున్నారు కొంతమంది. అలాంటి వారిలో బ్రిటన్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన శివానీ రాజా ఒకరు. ఈమె భగవద్గీతపై ఉన్న గౌరవాన్ని పార్లమెంటు సాక్షిగా ప్రదర్శించారు.

Indian-Origin UK MP Shivani Raja Took Oath On Bhagavad Gita: పాశ్చాత్య మోజులో పడి మన ఆచారాలు, వ్యవహారాలను గాలికొదిలేస్తున్న ఈరోజుల్లో.. విదేశాల్లో స్థిరపడి కూడా భారతీయ మూలలను అక్కడ ప్రతిధ్వనించేలా చేస్తున్నారు కొంతమంది. అలాంటి వారిలో బ్రిటన్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన శివానీ రాజా ఒకరు. ఈమె భగవద్గీతపై ఉన్న గౌరవాన్ని పార్లమెంటు సాక్షిగా ప్రదర్శించారు.

భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీ ప్రమాణ స్వీకారం.. సెల్యూట్ చేస్తున్న భారతీయులు

భగవద్గీతను ఒక మత గ్రంథంగా కాకుండా మేనేజ్మెంట్ బుక్ గా పరిగణిస్తాయి ప్రపంచ దేశాలు. గైడెన్స్, లీడర్ షిప్ క్వాలిటీస్, మేనేజ్మెంట్ వంటి వాటిని సాధించడం కోసం వ్యాపారవేత్తలు భగవద్గీతను చదువుతుంటారు. అలా భగవద్గీత ప్రేరణతో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలుగా ఎదుగుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారికే కాదు.. అన్ని రంగాలకు చెందిన వారికీ ఈ భగవద్గీత ఎంతో ప్రేరణనిస్తుంది. తాజాగా భగవద్గీత స్ఫూర్తిని అణువణువునా తనలో నింపుకున్న బ్రిటన్ ఎంపీ చేసిన పనికి ఇప్పుడు భారతీయులు సెల్యూట్ చేస్తున్నారు. ఆమె భగవద్గీత సాక్షిగా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లోకం ఆమెను ఆకాశానికి ఎత్తేస్తుంది.     

ఇటీవల బ్రిటన్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఎంపీ అభ్యర్థులు సత్తా చాటారు. ఏకంగా 27 మంది భారత సంతతి వ్యక్తులు బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ కు ఎంపికయ్యారు. వీరిలో భారత సంతతికి చెందిన శివానీ రాజా ఉన్నారు. ఈమె యువ ఎంపీగా ఎంపికయ్యారు. బ్రిటన్ పార్లమెంటులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆమె భగవద్గీత సాక్షిగా ఆమె ప్రమాణ స్వీకారం చేయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. గుజరాత్ మూలాలున్న శివానీ రాజా.. బ్రిటన్ లో బిజినెస్ ఉమెన్ గా ఉన్నారు. అక్కడ జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలిచారు. తాజాగా బ్రిటన్ పార్లమెంట్ లో ప్రమాణం చేశారు. 29 ఏళ్ల వయసులో ఆమె ఎంపీగా బ్రిటన్ పార్లమెంటులో అడుగుపెట్టారు. అడుగు పెట్టడంతోనే ఆమె భగవద్గీతకు ఎంత ప్రాధాన్యతనిస్తారో తెలిసేలా చేశారు.

ఆమె భగవద్గీత సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. లైసెస్టర్ ఈస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ బ్రిటన్ పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేయడం గౌరవంగా ఉందని.. అలానే బ్రిటన్ రాజు ఛార్లెస్ కి విధేయతగా ఉంటానని భగవద్గీతపై ప్రమాణం చేయడం నిజంగా గర్వంగా ఉంది అంటూ ఆమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం శివానీ రాజా పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ స్పందిస్తూ ఆమెను ప్రశంసిస్తున్నారు. మీరు భారతీయులను గర్వపడేలా చేశారు.. వేరే దేశంలో స్థిరపడినా భారతీయ మూలలను మరచిపోలేదు.. కృతజ్ఞతలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి శివానీ రాజా భగవద్గీత సాక్షిగా ఎంపీగా బ్రిటన్ పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి