Swetha
చిరంజీవి సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటారు. కానీ చిరు కంబ్యాక్ ఇచ్చిన తర్వాత వచ్చిన సినిమాలు ఆ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి అన్నది వాస్తవం. భోళా శంకర్ సినిమా తర్వాత చిరు కాస్త గ్యాప్ ఇచ్చిన సంగతి తెలియనిది కాదు.
చిరంజీవి సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటారు. కానీ చిరు కంబ్యాక్ ఇచ్చిన తర్వాత వచ్చిన సినిమాలు ఆ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి అన్నది వాస్తవం. భోళా శంకర్ సినిమా తర్వాత చిరు కాస్త గ్యాప్ ఇచ్చిన సంగతి తెలియనిది కాదు.
Swetha
చిరంజీవి సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటారు. కానీ చిరు కంబ్యాక్ ఇచ్చిన తర్వాత వచ్చిన సినిమాలు ఆ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి అన్నది వాస్తవం. భోళా శంకర్ సినిమా తర్వాత చిరు కాస్త గ్యాప్ ఇచ్చిన సంగతి తెలియనిది కాదు. ఆ గ్యాప్ తర్వాత చిరు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగా 157 సినిమా ఫుల్ స్పీడ్ మీద ఉన్న సంగతి తెలిసిందే. దానితో పాటు ఎప్పుడో విడుదల కావాల్సిన విశ్వంభర సినిమా ఈ మధ్యే ఓ కొలిక్కి వచ్చిన సంగతి కూడా తెలిసిందే.
మెగా 157 సంక్రాంతికి రిలీజ్ ను ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. విశ్వంభర కూడా ఈలోపే రీలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే కచ్చితంగా ఇదొక సెన్సేషన్ అవ్వడం ఖాయం. ఎందుకంటే ఇలా బ్యాక్ టు బ్యాక్ చిరు నుంచి ఇప్పటివరకు సినిమాలు రిలీజ్ కాలేదు. ఇదిలా ఉంచితే.. వీటి తర్వాత మెగాస్టార్ లైన్ అప్ లో మరో రెండు సినిమాలు ఉన్నాయ్. చిరు మరోసారి బాబీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు లేటెస్ట్ టాక్. వీరిద్దరి కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చిన సంగతి తెలియనిది కాదు. ఈ సినిమాకు ఆశించిన ఫలితం దక్కలేదు. అయినా సరే చిరు మరోసారి బాబీకి ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమాకు పూనకాలు లోడింగ్ అనే సినిమా టైటిల్ ప్రచారంలో ఉంది కానీ యూనిట్ సభ్యులు మాత్రం కాదనే అంటున్నారు. ఈ ఏడాదికి ఆఖరిలో సినిమాను మొదలుపెట్టి.. వచ్చే ఏడాది సమ్మర్ కి సినిమా కంప్లీట్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాడట బాబీ.
ఇక ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో జత కట్టబోతున్నాడట చిరు. ప్రస్తుతం శ్రీకాంత్ నానితో ది ప్యారడైజ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా అయినా తర్వాత చిరు సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమా చిరు కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ మూవీగా తెరకెక్కబోతుందంట. అనౌన్స్ చేసిన దగ్గర నుంచే సినిమా మీద భారీ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి . చూస్తుంటే చిరు సెకండ్ ఇన్నింగ్స్ లో దూకుడు చూపిస్తున్నడాపిస్తుంది. పైగా చిరు ఈసారి కొత్త డైరెక్టర్స్ కు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. పైగా వాళ్లంతా చిరు కల్ట్ ఫ్యాన్ బాయ్స్ కావడం మరో విశేషం. సో ఎలా చూసుకున్నా ఈసారి చిరు నుంచి వచ్చే సినిమాలు బొమ్మ బ్లాక్ బస్టర్ కావడం ఖాయం అని అంతా బలంగా నమ్ముతున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.