iDreamPost
android-app
ios-app

ఘాటీ రిలీజ్ సంగతి ఏమైనట్టు.. !

  • Published Jul 28, 2025 | 12:30 PM Updated Updated Jul 28, 2025 | 12:30 PM

అనుష్క ఘాటీ సినిమా అనౌన్స్ చేసినప్పుడు..ఆ సినిమా నుంచి గ్లిమ్ప్స్ రిలీజ్ చేసినప్పుడు సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇదివరకు ఎప్పుడు లేని విధంగా అనుష్క కనిపించడంతో స్వీటీ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

అనుష్క ఘాటీ సినిమా అనౌన్స్ చేసినప్పుడు..ఆ సినిమా నుంచి గ్లిమ్ప్స్ రిలీజ్ చేసినప్పుడు సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇదివరకు ఎప్పుడు లేని విధంగా అనుష్క కనిపించడంతో స్వీటీ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

  • Published Jul 28, 2025 | 12:30 PMUpdated Jul 28, 2025 | 12:30 PM
ఘాటీ రిలీజ్ సంగతి ఏమైనట్టు.. !

అనుష్క ఘాటీ సినిమా అనౌన్స్ చేసినప్పుడు..ఆ సినిమా నుంచి గ్లిమ్ప్స్ రిలీజ్ చేసినప్పుడు సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇదివరకు ఎప్పుడు లేని విధంగా అనుష్క కనిపించడంతో స్వీటీ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ అనుకున్న టైం కి ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఏప్రిల్ 18 , జూలై 11 అని రెండు సార్లు పోస్ట్ పోన్ అయింది. ఈ రెండిటిలో ఏ డేట్ లో రిలీజ్ అయినా కానీ.. ఆ సమయానికి ఉన్న బజ్ కి సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. కానీ ఇప్పుడు అసలు ఈ సినిమా ఏమైపోయిందో ఎవరికీ అర్థంకాకుండా పోయింది.

నిన్న మొన్నటివరకు ఫిలిం నగర్ వర్గాల్లో ఘాటీ సినిమా సెప్టెంబర్ 5 రావొచ్చని ప్రకటన జరిగింది. కానీ ఇప్పుడు ఎలాంటి సౌండ్ లేదు. ఎందుకంటే అదే డేట్ కి తేజ సజ్జ మిరాయ్ కన్ఫర్మ్ చేసుకుంది. కాబట్టి ఈ సినిమా వస్తుందా లేదా అనే సందేహాలు పెరిగిపోయాయి. అటు యువి క్రియేషన్స్ నుంచి ఎలాంటి సౌండ్ లేదు. మొన్నటివరకు విశ్వంభరకు కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. కానీ ఈ మధ్య దాని నుంచి కూడా అప్డేట్ ఇచ్చేసారు మేకర్స్. ఇక మిగిలింది ఘాటీ మాత్రమే. ఘాటీ ఎప్పుడు మౌనం వీడుతుందా అని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇక అనుష్క సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు సోషల్ మీడియాలో కానీ అటు మూవీ పరంగా కానీ ఎక్కడ దర్శనం ఇవ్వడం లేదు ఈ అమ్మడు. కనీసం రూమర్స్ కు కూడా ఛాన్స్ ఇవ్వడం లేదు. కనీసం ఘాటీ మూవీ ప్రమోషన్స్ కైనా వస్తుందా లేదా అనే సందేహాలు ఉండనే ఉన్నాయి. స్వీటీని ఎప్పుడు చూస్తామంటూ సోషల్ మీడియాలో అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సినిమా ఇంకా పోస్ట్ పోన్ అయితే కనుక ఉన్న ఈ కాస్త బజ్ కూడా ఉంటుందో లేదో సందేహమే. ఇప్పటికైనా ఘాటీ మేకర్స్ మౌనం వీడుతారో లేదో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.