iDreamPost
android-app
ios-app

OTT లోకి తమ్ముడు స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే ?

  • Published Jul 28, 2025 | 1:33 PM Updated Updated Jul 28, 2025 | 1:33 PM

నితిన్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడు అనే ధైర్యంతో.. ఎన్నో అంచనాల మధ్య ఈ తమ్ముడు సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా నితిన్ తో పాటు కొందరు సీనియర్ ఆర్టిస్ట్ లకు కూడా కంబ్యాక్ మూవీ నిలిచిపోతుందని అంతా స్ట్రాంగ్ గా నమ్మారు. కానీ ఊహించని విధంగా సినిమా థియేటర్ లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

నితిన్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడు అనే ధైర్యంతో.. ఎన్నో అంచనాల మధ్య ఈ తమ్ముడు సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా నితిన్ తో పాటు కొందరు సీనియర్ ఆర్టిస్ట్ లకు కూడా కంబ్యాక్ మూవీ నిలిచిపోతుందని అంతా స్ట్రాంగ్ గా నమ్మారు. కానీ ఊహించని విధంగా సినిమా థియేటర్ లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

  • Published Jul 28, 2025 | 1:33 PMUpdated Jul 28, 2025 | 1:33 PM
OTT లోకి తమ్ముడు స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే ?

నితిన్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడు అనే ధైర్యంతో.. ఎన్నో అంచనాల మధ్య ఈ తమ్ముడు సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా నితిన్ తో పాటు కొందరు సీనియర్ ఆర్టిస్ట్ లకు కూడా కంబ్యాక్ మూవీ నిలిచిపోతుందని అంతా స్ట్రాంగ్ గా నమ్మారు. కానీ ఊహించని విధంగా సినిమా థియేటర్ లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. భారీ ఖర్చుతో తెరకెక్కించిన ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ను అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు థియేటర్ లో మెప్పించలేకపోయిన ఓటిటి లో అదరగొడుతూ ఉన్నాయి. ఇక ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి.

తమ్ముడు సినిమా కథ విషయానికొస్తే.. చిన్నప్పుడే తన తల్లి చనిపోవడంతో.. తన తమ్ముడి జై కి తానె అన్నీ అయ్యి పెంచుతుంది అక్క లయ. అదే క్రమంలో ఆమె ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని కుటుంబానికి దూరం అవుతుంది. అప్పటినుంచి జై ఒంటరిగానే పెరుగుతాడు. అతని ఆర్చరీలో మంచి నైపుణ్యం సంపాదించుకుంటాడు. కానీ అక్క జ్ఞాపకాల వలన దానిలో గోల్డ్ మెడల్ సాదించలేకపోతాడు. అప్పటినుంచి అక్కను వెతకడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో లయ ఓ సమస్యలో చిక్కుకుందని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది జై తన అక్క కుటుంబాన్ని కాపాడాడా లేదా ? తానూ అనుకున్న లక్ష్యాన్ని ఛేదించాడా లేదా ? చివరికి ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ చూడాల్సిందే.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఆగష్టు 1 నుంచి తమ్ముడు మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్ ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ఓటిటి ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుందనే అనుకుంటున్నారు మేకర్స్. ఇక ఏమౌతుందో చూడాలి. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.