Swetha
విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ కు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా మీద అటు మూవీ టీం తో పాటు ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. హరి హర వీరమల్లు మీద భారీ అంచనాలు పెట్టుకుని.. అది కింగ్డమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని అంతా అనుకున్నారు.
విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ కు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా మీద అటు మూవీ టీం తో పాటు ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. హరి హర వీరమల్లు మీద భారీ అంచనాలు పెట్టుకుని.. అది కింగ్డమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని అంతా అనుకున్నారు.
Swetha
విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ కు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా మీద అటు మూవీ టీం తో పాటు ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. హరి హర వీరమల్లు మీద భారీ అంచనాలు పెట్టుకుని.. అది కింగ్డమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా రిజల్ట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో.. కింగ్డమ్ కు రూట్ క్లియర్ అయినట్లే అని ట్రేడ్ పండితుల అంచనా. ఎంత లేదన్న కింగ్డమ్ కు సాలిడ్ గా రెండు వారాల పాటు ఓపెన్ గ్రౌండ్ దక్కుతుంది. ఆగస్టు 14 కూలి, వార్ 2 వచ్చేవరకు థియేటర్స్ అన్ని విజయ్ దేవర కొండవే. సో అందుకోసం ఇప్పుడు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా మూవీ టీం ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నారు.
ఇక కింగ్డమ్ బిజినెస్ డీల్స్ విషయానికొస్తే.. ఈ సినిమా సుమారు 100కోట్ల గ్రాస్ ను టార్గెట్ గా పెట్టుకుని బరిలోకి దిగుతుంది. అంటే షేర్ 50-55 కోట్లు దాటాల్సి ఉంటుంది. ట్రేడ్ టాక్ ప్రకారం నైజాం 15 కోట్లు, సీడెడ్ 6 కోట్లు, ఆంధ్ర 15 కోట్లు, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలు 3.5 కోట్లు, ఓవర్సీస్ 10 కోట్లు, ఇతర డబ్బింగ్ వెర్షన్లు 4 కోట్ల వరకు డీల్ జరిగిందట. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటివరకు జరిగిన ప్రమోషన్స్ లో సినిమాలో యాక్షన్ సీన్స్ పుష్కలంగా ఉంటాయనే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. సో సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు సినిమాకు కావాల్సిందల్లా రిలీజ్ తర్వాత బ్లాక్ బస్టర్ టాక్ మాత్రమే.
అయితే కింగ్డమ్ కు ముందు రోజు ప్రీమియర్స్ వేసే ఛాన్స్ లేదన్న మాటే ఎక్కువ వినిపిస్తుంది. ఇలాంటి షోస్ వలన వచ్చే లాభం కంటే కూడ నష్టమే ఎక్కువగా ఉంటుందని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంట మేకర్స్. సో ప్రస్తుతానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సినిమాకు ఎలాంటి కాంపిటీషన్ లేదు కాబట్టి.. టాక్ బావుంటే ఈజీగా అనుకున్న టార్గెట్ ను రీచ్ అవ్వడం ఖాయం. ఇక ఈలోపు సినిమా మీద ఎలాంటి బజ్ క్రియేట్ చేయాలన్నా..అది మేకర్స్ చేతిలోనే ఉంది. ముందు ముందు దీని నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.