Swetha
రెబెల్ స్టార్ ప్రభాస్ నుంచి ఏడాదికి ఒక్క సినిమా వచ్చినా కానీ. ఆ రిజల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలియనిది కాదు. అందులో ఒకటి సందీప్ రెడ్డి వంగతో కలిసి చేయనున్న స్పిరిట్ మూవీ. అర్జున్ రెడ్డి , యానిమల్ లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించిన సందీప్..
రెబెల్ స్టార్ ప్రభాస్ నుంచి ఏడాదికి ఒక్క సినిమా వచ్చినా కానీ. ఆ రిజల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలియనిది కాదు. అందులో ఒకటి సందీప్ రెడ్డి వంగతో కలిసి చేయనున్న స్పిరిట్ మూవీ. అర్జున్ రెడ్డి , యానిమల్ లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించిన సందీప్..
Swetha
రెబెల్ స్టార్ ప్రభాస్ నుంచి ఏడాదికి ఒక్క సినిమా వచ్చినా కానీ. ఆ రిజల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలియనిది కాదు. అందులో ఒకటి సందీప్ రెడ్డి వంగతో కలిసి చేయనున్న స్పిరిట్ మూవీ. అర్జున్ రెడ్డి , యానిమల్ లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించిన సందీప్.. ఈ రెబెల్ గాడ్ తో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడా అని అంతా డబుల్ ఎగ్జైట్మెంట్ తో ఎదురుచూస్తున్నారు. ఈ కాంబినేషన్ కచ్చితంగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందని అంతా బలంగా నమ్ముతున్నారు. ఎన్ని కోట్లు గుమ్మరిస్తుందో అని ఇప్పటినుంచే లెక్కలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది.
అదే సినిమా షూటింగ్ అప్డేట్.. సినిమా గురించి అనౌన్స్ చేసి రెండు మూడేళ్లు కావొస్తుంది. అదిగో ఇదిగో అంటున్నారు కానీ సరైన ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వడం లేదు. ఇక అభిమానులు కూడా సరే వచ్చినప్పుడే వస్తుందిలే అని లైట్ తీసుకునే సమయానికి.. సందీప్ రెడ్డి వంగ షూటింగ్ అప్డేట్ తో వచ్చేసాడు. కింగ్డమ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రమోషనల్ వీడియోలో పాల్గొన్న సందీప్ మాటల్లో మాటగా స్పిరిట్ అప్డేట్ ఇచ్చేశాడు. సెప్టెంబరు చివరి వారం నుంచి చిత్రీకరణ ఉంటుందని సందీప్ పేర్కొన్నారు. అంటే మరో రెండు నెలల్లో స్పిరిట్ సెట్స్ మీదకు వెళ్లబోతుందన్నమాట. అప్పటినుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టినా కూడా సరిగ్గా ఏడాదిలో సినిమా పూర్తైపోతుంది. అంటే 2026 లో దాదాపు స్పిరిట్ రిలీజ్ ఉండొచ్చన్నమాట.
ఈ ఏడాది ఆఖరిలో ఇప్పటివరకు వచ్చిన బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కు చెక్ పెట్టడానికి రాజాసాబ్ తో రానున్నాడు డార్లింగ్. ఇక ఆ తర్వాత హను రాఘవపూడి తో ఫౌజీ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ అయితే ఏమి రాలేదు. ప్రభాస్ మాత్రం గ్యాప్ లేకుండా జెట్ స్పీడ్ తో సినిమాలు చేసుకుంటూ.. కెరీర్ లో పీక్ స్టేజ్ ను బాగా యుటిలైజ్ చేసుకుంటున్నాడు . ముందు ముందు ప్రభాస్ సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.