Swetha
రీసెంట్ గా వార్ 2 మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలు నెలకొన్నాయి తెలియనిది కాదు. ఇప్పుడు ట్రైలర్ తో ఆ అంచనాల స్థాయి ఇంకాస్త పెరిగిపోయింది. ముఖ్యంగా తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు. ఈ సినిమాకు పోటీగా కూలి సినిమా కూడా ఉంది.
రీసెంట్ గా వార్ 2 మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలు నెలకొన్నాయి తెలియనిది కాదు. ఇప్పుడు ట్రైలర్ తో ఆ అంచనాల స్థాయి ఇంకాస్త పెరిగిపోయింది. ముఖ్యంగా తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు. ఈ సినిమాకు పోటీగా కూలి సినిమా కూడా ఉంది.
Swetha
రీసెంట్ గా వార్ 2 మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలు నెలకొన్నాయి తెలియనిది కాదు. ఇప్పుడు ట్రైలర్ తో ఆ అంచనాల స్థాయి ఇంకాస్త పెరిగిపోయింది. ముఖ్యంగా తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు. ఈ సినిమాకు పోటీగా కూలి సినిమా కూడా ఉంది. దీనితో వార్ 2 మేకర్స్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. సో ప్రస్తుతం సినిమా మీద బజ్ బాగానే ఉంది. అలాగే సినిమాలో హీరోలు తీసుకున్న రెమ్యునరేషన్ గురించి కూడా కొన్ని మాటలు వైరల్ అవుతున్నాయి.
పాన్ ఇండియా సినిమాల ప్రభావం ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో తెలియనిది కాదు. ఇక్కడ సినిమాలు అక్కడ డబ్బింగ్ చేయడంతో అక్కడ కూడా మన హీరోలకు ఇమేజ్ బాగా పెరిగిపోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే ఏకంగా వార్ 2 తో బాలీవుడ్ లో డైరెక్ట్ గా ల్యాండ్ అయ్యాడు. ట్రైలర్ ను బట్టి గమనిస్తే ఎన్టీఆర్ ది విలన్ రోల్ అనే టాక్ నడుస్తుంది. తారక్ హీరోనా విలన్ ఆ అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే తారక్ తనకున్న క్రేజ్ ను బాగానే క్యాష్ చేసుకున్నట్లు.. అతనికి నిర్మాతలు భారీగా రెమ్యునరేషన్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.
వార్ 2 లో నటించిందనందుకు తారక్ కు ఏకంగా రూ.60 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే హృతిక్ కు కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. హీరోయిన్ కియారా అద్వానీకి రూ.15 కోట్లు, దర్శకుడు అయాన్ ముఖర్జీకి రూ.32 కోట్లు ఇచ్చినలు బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. దీనిని బట్టి చూస్తే అందరికంటే ఎక్కువగా తారక్ ఏ భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక వార్ 2 ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.