Swetha
నిజానికి దుల్కర్ సల్మాన్ మలయాళ హీరో అయినా సరే.. తెలుగులో కూడా ఈ హీరోకు సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంటున్నాడు. దుల్కర్ లాస్ట్ మూవీ లక్కీ భాస్కర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలియనిది కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
నిజానికి దుల్కర్ సల్మాన్ మలయాళ హీరో అయినా సరే.. తెలుగులో కూడా ఈ హీరోకు సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంటున్నాడు. దుల్కర్ లాస్ట్ మూవీ లక్కీ భాస్కర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలియనిది కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
Swetha
నిజానికి దుల్కర్ సల్మాన్ మలయాళ హీరో అయినా సరే.. తెలుగులో కూడా ఈ హీరోకు సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంటున్నాడు. దుల్కర్ లాస్ట్ మూవీ లక్కీ భాస్కర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలియనిది కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మధ్య దుల్కర్ పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇప్పుడు డైరెక్టర్ సెల్వమణి , సెల్వరాజ్ డైరెక్షన్ లో ఓ ఇంట్రెస్టింగ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు దుల్కర్. ఈ సినిమా పేరు కాంత.. లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ టీజర్ కట్ చూసి కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పేయొచ్చు. ఆ రేంజ్ లో టీజర్ కట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చూడగానే మాత్రం మహానటిలో జెమిని గణేశన్ క్యారక్టరైజేషన్ గుర్తురావడం ఖాయం. అది కాకుండా ఆ పాత్రలో దుల్కర్ మేక్ ఓవర్ హావభావలు , నటన వాట్ నాట్ ఎవ్రిథింగ్ అన్నట్లు.. ఆద్యంతం ఆకట్టుకుంది. టీజర్ విషయానికొస్తే.. తెలుగు సినిమాలు తెర మీదకు వస్తున్న ఆ తొలిరోజుల్లో ఆ షూటింగ్ అంత ఎలా ఉండేదో శాంపిల్ చూపించారు. అక్కడ శాంత అనే ఓ హర్రర్ సినిమాను చిత్రీకరిస్తూ ఉంటారు. తన గురువైన సముద్రఖనికి ధీటుగా దుల్కర్ ఆ సినిమాను తెరకెక్కించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో దుల్కర్ చేసే పెర్ఫార్మెన్స్ థియేటర్ లో విజిల్స్ వేయిస్తుందని టీజర్ తోనే హింట్ ఇచ్చేశారు.
ఆ సినిమా దుల్కర్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత శాంత కాస్త కాంత గా మారిపోతుంది. దానితో టీజర్ ను ఎండ్ చేసేసారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.సెప్టెంబర్ 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ముందు ముందు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.