iDreamPost
android-app
ios-app

హరి హర పార్ట్ 2 ఉంటుంది.. కానీ !

  • Published Jul 25, 2025 | 10:20 AM Updated Updated Jul 25, 2025 | 10:20 AM

ఐదేళ్ల అభిమానుల నిరీక్షణకు జులై 24 న తెరపడింది. హరి హర వీరమల్లు కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు. అయితే సినిమాకు ప్రస్తుతం మిక్సెడ్ టాక్ లభిస్తుంది. సినిమా సెకండ్ హాఫ్ లో VFX దెబ్బ కొట్టిందని పవన్ అభిమానులే చెప్తున్నా వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఐదేళ్ల అభిమానుల నిరీక్షణకు జులై 24 న తెరపడింది. హరి హర వీరమల్లు కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు. అయితే సినిమాకు ప్రస్తుతం మిక్సెడ్ టాక్ లభిస్తుంది. సినిమా సెకండ్ హాఫ్ లో VFX దెబ్బ కొట్టిందని పవన్ అభిమానులే చెప్తున్నా వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Published Jul 25, 2025 | 10:20 AMUpdated Jul 25, 2025 | 10:20 AM
హరి హర పార్ట్ 2 ఉంటుంది.. కానీ !

ఐదేళ్ల అభిమానుల నిరీక్షణకు జులై 24 న తెరపడింది. హరి హర వీరమల్లు కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు. అయితే సినిమాకు ప్రస్తుతం మిక్సెడ్ టాక్ లభిస్తుంది. సినిమా సెకండ్ హాఫ్ లో VFX దెబ్బ కొట్టిందని పవన్ అభిమానులే చెప్తున్నా వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా ఐదేళ్ల కల.. ఇద్దరు దర్శకులు.. మధ్యలో ఎన్నో అడ్డంకులు వాటి అన్నింటిని దాటి సినిమా రిలీజ్ అయింది. VFX లోపాలను సరిచేసి కొత్త ప్రింట్ ను రిలీజ్ చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమాకు గ్రాండ్ ఓపెనింగ్స్ కూడా దక్కాయి. ఇక హరిహర వీరమల్లు పార్ట్ 2కి బ్యాటిల్ ఫీల్డ్ అని నామకరణం కూడా చేసిన సంగతి తెలిసిందే.

అయితే పార్ట్ 1 కి సరిగా క్లోజర్ ఇవ్వకపోవడంతో.. ఇప్పుడు అందరిని పార్ట్ 2 మీద సందేహాలు మొదలయ్యాయి. అటు పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పుడు వచ్చిన ఫీడ్ బ్యాక్ ను బట్టి.. లోపాలను సరి చేసి పార్ట్ 2 తీస్తామని చెప్పారు. కానీ పార్ట్ 2.. మొత్తం పార్ట్ 1 మీదే ఆధారపడి ఉంటుంది. పార్ట్ 1 బ్రేక్ దాటి రికవరీ ఇవ్వాలి.. ఎలాంటి నష్టాలు రాకూడదు. నిర్మాత పెట్టిన పెట్టుబడి వెనక్కు రావాలి. అలాగే అటు పవన్ కళ్యాణ్ డేట్స్ కావాలి. ఇలా అన్ని సమపాళ్లలో జరిగితే తప్ప పార్ట్ 2 కి సరైన స్టార్ట్ ఉండేలా లేదు.

ప్రాక్టికల్ గా చూసుకుంటే కాస్త కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది.. కానీ అసాధ్యం అని చెప్పలేము. అయితే బాహుబలి 2 , పుష్ప 2 కోసం వెయిట్ చేసేంత సస్పెన్స్ అయితే ఉండదు. అలాంటి ఎగ్జైట్మెంట్ ను కలిగించడంలో ఇక్కడ దర్శకుడు కాస్త తడబడ్డాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆడియన్స్ లో ఈ ఫీలింగ్ తగ్గించి పార్ట్ 2 వచ్చే టైం కు ఈ తప్పులన్నీ సరి చేసుకుని ఇంట్రెస్ట్ కలిగిస్తే అప్పుడు సినిమా మీద బజ్ పెరిగి అవకాశం ఉంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.