Swetha
ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలు థియేటర్ కు రాకముందే.. ఓటిటి పార్ట్నర్స్ ను ఫిక్స్ చేసుకుంటున్నాయి. పైగా సినిమా రిలీజ్ డేట్స్ ఓటిటి డీల్ మీదే ఆధారపడి ఉంటున్నాయని టాక్ కూడా నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది

ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలు థియేటర్ కు రాకముందే.. ఓటిటి పార్ట్నర్స్ ను ఫిక్స్ చేసుకుంటున్నాయి. పైగా సినిమా రిలీజ్ డేట్స్ ఓటిటి డీల్ మీదే ఆధారపడి ఉంటున్నాయని టాక్ కూడా నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది. ప్రస్తుతానికి టాక్ అయితే మిక్సెడ్ ఉంది. ఇక లెక్కల సంగతి వీకెండ్ కంప్లీట్ అయితే కానీ చెప్పలేము. అయితే ఇప్పుడు సినిమా ఓటిటి పార్ట్నర్ ఎవరనే విషయంలో ఆసక్తి నెలకొంది.
హరి హర వీరమల్లు సినిమా సుమారు రూ.300 కోట్లు పెట్టి తెరకెక్కించారు. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మూవీ రిలీజ్ కు ముందే అమ్ముడుపోయినట్లు సమాచారం. దాదాపు రూ.50 కోట్ల వరకు హరి హర వీరమల్లు ఓటిటి రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా ఓటిటి రైట్స్ ను కొనుగోలు చేసిందట. ఇక అన్ని సినిమాలలానే ఈ సినిమా కూడా థియేటర్ రిలీజ్ కు నాలుగు వారాల తర్వాత ఓటిటి స్ట్రీమింగ్ కు రానుంది. ప్రస్తుతం అయితే థియేట్రికల్ రన్ బాగానే జరుగుతుంది. కానీ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కు ఇంకా ముందే వస్తుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.