Swetha
ఈ వీకెండ్ ఓటిటిలో చాలా వరకు థ్రిల్లర్ సినిమాలే ఉన్నాయి. ఇప్పటికే షో టైం , మార్గన్ లాంటి సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇవన్నీ కాకుండా ఇప్పుడు సడెన్ గా ఓటిటి లోకి ఓ లవ్ స్టోరీ ఎంట్రీ ఇచ్చింది. అది కూడా కేవలం థియేటర్ లో రిలీజ్ అయిన మూడు వారాలకే ఓటిటి లో ఎంట్రీ ఇవ్వడం విశేషం
ఈ వీకెండ్ ఓటిటిలో చాలా వరకు థ్రిల్లర్ సినిమాలే ఉన్నాయి. ఇప్పటికే షో టైం , మార్గన్ లాంటి సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇవన్నీ కాకుండా ఇప్పుడు సడెన్ గా ఓటిటి లోకి ఓ లవ్ స్టోరీ ఎంట్రీ ఇచ్చింది. అది కూడా కేవలం థియేటర్ లో రిలీజ్ అయిన మూడు వారాలకే ఓటిటి లో ఎంట్రీ ఇవ్వడం విశేషం
Swetha
ఈ వీకెండ్ ఓటిటిలో చాలా వరకు థ్రిల్లర్ సినిమాలే ఉన్నాయి. ఇప్పటికే షో టైం , మార్గన్ లాంటి సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇవన్నీ కాకుండా ఇప్పుడు సడెన్ గా ఓటిటి లోకి ఓ లవ్ స్టోరీ ఎంట్రీ ఇచ్చింది. అది కూడా కేవలం థియేటర్ లో రిలీజ్ అయిన మూడు వారాలకే ఓటిటి లో ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు థియేటర్ లో హిట్ అందుకోకపోయిన ఓటిటి లో మాత్రం అదరగొడుతూ ఉంటున్నాయి. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. కృష్ణమూర్తి అనే అతను ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు . అతను ఇంజినీరింగ్ చదివే డేస్ లో ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ ఆమె బ్రేక్ అప్ చెప్పడంతో అందరి కుర్రాళ్ళలానే మద్యానికి బానిస అయిపోతాడు ఈ హీరో. కానీ రోజులు గడిచేకొద్దీ మళ్ళీ తన తండ్రి ప్రోత్సాహంతో మామూలు మనిషిగా మారుతాడు. ఉద్యోగంలో చేరతాడు. అక్కడ స్రుతి అనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అంతా బాగానే సాగిపోతుంది అనుకునే సమయానికి అతని తండ్రి మరణిస్తాడు. ఇక మరోవైపు అతని ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతూ ఉంటుంది. దీనితో శృతి అతనికి విడాకులు ఇస్తుంది. వీటి అన్నిటిని దాటుకుని ఆ కుర్రాడు ఎలా ఎదిగాడు ? ఆ తర్వాత ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
కాస్త రొటీన్ కథలనే అనిపించినా.. సినిమా ఎండ్ వరకు చూస్తే టైటిల్ ను జస్టిఫై చేసారని అర్ధమౌతుంది. ఈ సినిమా పేరు ‘సోలో బాయ్’. బిగ్ బాస్ తో పేరు సంపాదించుకున్న గౌతమ్ కృష్ణ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది కానీ.. స్టార్ నటీ నటులు లేకపోవడంతో సినిమాను పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఓటిటి లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని అంతా అనుకుంటున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి