iDreamPost
android-app
ios-app

విధ్వంసం సృష్టిస్తున్న వార్ 2 ట్రైలర్..

  • Published Jul 25, 2025 | 10:56 AM Updated Updated Jul 25, 2025 | 11:33 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 సినిమా మీద అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలియనిది కాదు. బాలీవుడ్ లో ఎన్టీఆర్ మొదటి స్ట్రెయిట్ సినిమా కావడంతో... ఎన్టీఆర్ అభిమానులు తెగ ఆనందపడుతున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 సినిమా మీద అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలియనిది కాదు. బాలీవుడ్ లో ఎన్టీఆర్ మొదటి స్ట్రెయిట్ సినిమా కావడంతో... ఎన్టీఆర్ అభిమానులు తెగ ఆనందపడుతున్నారు.

  • Published Jul 25, 2025 | 10:56 AMUpdated Jul 25, 2025 | 11:33 AM
విధ్వంసం సృష్టిస్తున్న వార్ 2 ట్రైలర్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 సినిమా మీద అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలియనిది కాదు. బాలీవుడ్ లో ఎన్టీఆర్ మొదటి స్ట్రెయిట్ సినిమా కావడంతో… ఎన్టీఆర్ అభిమానులు తెగ ఆనందపడుతున్నారు. ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద తారక్ ను చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వార్ 2 టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ ను ఫీడ్ బ్యాక్ ను కన్సిడర్ చేసి ట్రైలర్ కట్ ను అద్భుతంగా రెడీ చేసి రిలీజ్ చేశారు మేకర్స్.

ఇక వారు 2 ట్రైలర్ ను బట్టి స్టోరీ లైన్ ను గమనిస్తే.. ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్) దేశం కోసం తన ప్రాణాలనైనా వదులుకునేందుకు సిద్ద పడే సిన్సియర్ ఏజెంట్. ఇక ఎలాంటి లక్ష్యాన్నైనా సరే దానిని తన వెపన్ గా మార్చుకునే ఏజెంట్ విక్రమ్ (జూనియర్ ఎన్టీఆర్) . ఈ ఇద్దరి టార్గెట్స్ వేరు వేరు. వీరికి శత్రువుల వలన ప్రమాదాలు ఏర్పడతాయి. ఈ క్రమంలో ఇద్దరు యుద్ధంలో భాగమౌతారు. వేరు వేరు జర్నీస్ చేస్తూ వచ్చే ఇద్దరూ దేశం కోసం చేతులు కలుపుతారు. కానీ దాని వలన ఆ ఇద్దరి మధ్య వార్ మొదలవుతుంది. అసలు వార్ 2 ఎందుకు వచ్చింది ? వీరిద్దరి మధ్య ఎలాంటి విధ్వంసాలు ఏర్పడతాయి.. ఆ తర్వాత ఏమి జరుగుతుంది అనేది తెరపై చూడాల్సిన కథ.

వార్ 2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ చాలా ప్రీ ప్లాన్డ్ గా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ను గమనిస్తే సినిమా టైటిల్ కు తగినట్టే.. స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఉంది . సినిమాలో యాక్షన్ సిక్వెన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి . మెయిన్ గా ఎన్టీఆర్ , హృతిక్ మధ్య వార్ సీన్స్ అదిరిపోయేలా కనిపిస్తున్నాయి. ఇద్దరు తమ పెర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నారని క్లియర్ గా అర్ధమౌతుంది. ఇక ఆగష్టు 14 న రిలీజ్ అయ్యే సినిమా ఎలాంటి విద్వాంసాన్ని సృష్టింస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.