iDreamPost
android-app
ios-app

ఎట్టకేలకు లాస్ట్ స్టేజ్ కు చేరుకున్న విశ్వంభర

  • Published Jul 25, 2025 | 4:16 PM Updated Updated Jul 25, 2025 | 4:16 PM

కొన్ని సినిమాల కోసం ఎన్ని నెలలైన ఎదురుచూడొచ్చు అనిపిస్తది.. కానీ కొన్ని సినిమాల కోసం ఎదురు చూసి చూసి అలసిపోతూ ఉంటారు ప్రేక్షకులు. ఒక్కసారి సినిమా చెప్పిన టైం కు రాకపోతే సరే పరవాలేదులే అనుకుంటారు. కానీ అదే సినిమా పదే పదే పోస్ట్ పోన్ అవుతుంటే మాత్రం ఇంకా ఆ సినిమా మీద ఆశలు వదిలేకుంటారు

కొన్ని సినిమాల కోసం ఎన్ని నెలలైన ఎదురుచూడొచ్చు అనిపిస్తది.. కానీ కొన్ని సినిమాల కోసం ఎదురు చూసి చూసి అలసిపోతూ ఉంటారు ప్రేక్షకులు. ఒక్కసారి సినిమా చెప్పిన టైం కు రాకపోతే సరే పరవాలేదులే అనుకుంటారు. కానీ అదే సినిమా పదే పదే పోస్ట్ పోన్ అవుతుంటే మాత్రం ఇంకా ఆ సినిమా మీద ఆశలు వదిలేకుంటారు

  • Published Jul 25, 2025 | 4:16 PMUpdated Jul 25, 2025 | 4:16 PM
ఎట్టకేలకు లాస్ట్ స్టేజ్ కు చేరుకున్న విశ్వంభర

కొన్ని సినిమాల కోసం ఎన్ని నెలలైన ఎదురుచూడొచ్చు అనిపిస్తది.. కానీ కొన్ని సినిమాల కోసం ఎదురు చూసి చూసి అలసిపోతూ ఉంటారు ప్రేక్షకులు. ఒక్కసారి సినిమా చెప్పిన టైం కు రాకపోతే సరే పరవాలేదులే అనుకుంటారు. కానీ అదే సినిమా పదే పదే పోస్ట్ పోన్ అవుతుంటే మాత్రం ఇంకా ఆ సినిమా మీద ఆశలు వదిలేకుంటారు. ఇప్పుడు విశ్వంభర పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. గత రెండు మూడు వారాలుగా మాత్రం విశ్వంభర రిలీజ్ డేట్ గురించి మాటలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఎట్టకేలకు విశ్వంభర పెండింగ్ వర్క్స్ అన్ని ఫినిషింగ్ కు వచ్చినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం చిరంజీవి , మౌనిరాయ్ ల మీద ఓ సాంగ్ ను షూట్ చేస్తున్నారట. దానికి సంబందించిన ఓ ప్రీ లుక్ ను దర్శకుడు వసిష్ఠ షేర్ చేశాడు. ఈ అప్డేట్స్ అన్ని బాగానే ఉన్నాయి కానీ అసలు మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. ఓ వైపు చూస్తుంటేనేమో ఆగష్టు నుంచి డిసెంబర్ వరకు వరుస పాన్ ఇండియా సినిమాలు క్యూ లో ఉన్నాయి. ఎలా చూసిన విశ్వంభర కు సరైన డేట్ ఎడ్జస్ట అవ్వడం కష్టంగానే ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన టీజర్ కు నెగెటివ్ టాక్ వచ్చింది. ఆ టాక్ అంత ట్రైలర్ తో పాజిటివ్ గా మార్చేస్తాం అనే ధీమాతో ఉన్నారు.

ముఖ్యంగా హరి హర వీరమల్లు లో వచ్చిన కంప్లైంట్స్ అన్ని కూడా VFX విషయంలోనే. సో దానిని చూసి విశ్వంభర మేకర్స్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నారు. క్వాలిటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సినిమా ఆలస్యం అయింది కాబట్టి.. ఇంకా పొరపాట్లు ఉంటె సినిమాకు కంప్లీట్ నెగిటివిటి పెరిగిపోతుంది. సో ఆలస్యం అయితే అయింది కానీ ఈలోపే ఫైనల్ కాపీ క్వాలిటీగా ఉంటె చాలని అంతా అనుకుంటున్నారు. ఏదేమైనా వీలైనంత త్వరగా విశ్వంభర పెండింగ్ వర్క్స్ ఫినిష్ చేసుకుని.. అప్డేట్స్ ఇవ్వడం బెటర్. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.