Swetha
పవన్ కళ్యాణ్ సినిమాకు పోటీగా ఓ యానిమేటెడ్ ఫిల్మ్ మార్కెట్ లో ఎంట్రీ ఇస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఈ మధ్య కాలంలో యానిమేషన్ సినిమాలకు బాగానే రెస్పాన్స్ ఉంది కానీ. ఓ పాన్ ఇండియా గ్రాండియర్ తో పాటు ఇలాంటి సినిమాను దింపడం అనేది సాహసమనే చెప్పాలి.
పవన్ కళ్యాణ్ సినిమాకు పోటీగా ఓ యానిమేటెడ్ ఫిల్మ్ మార్కెట్ లో ఎంట్రీ ఇస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఈ మధ్య కాలంలో యానిమేషన్ సినిమాలకు బాగానే రెస్పాన్స్ ఉంది కానీ. ఓ పాన్ ఇండియా గ్రాండియర్ తో పాటు ఇలాంటి సినిమాను దింపడం అనేది సాహసమనే చెప్పాలి.
Swetha
పవన్ కళ్యాణ్ సినిమాకు పోటీగా ఓ యానిమేటెడ్ ఫిల్మ్ మార్కెట్ లో ఎంట్రీ ఇస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఈ మధ్య కాలంలో యానిమేషన్ సినిమాలకు బాగానే రెస్పాన్స్ ఉంది కానీ. ఓ పాన్ ఇండియా గ్రాండియర్ తో పాటు ఇలాంటి సినిమాను దింపడం అనేది సాహసమనే చెప్పాలి. నిన్న విడుదలైన మహావతార నరసింహకు స్లో స్లో గా పోసిటివ్ టాక్ బయటకు వస్తుంది. వాస్తవానికి సినిమాకు మరీ అంతా బజ్ లేదు. కెజిఎఫ్ , సాలార్ నిర్మాతలు భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను తెరమీదకు తీసుకుని వచ్చారు. హై క్వాలిటీ విజువల్స్ తో ఆడియన్స్ కు థ్రిల్లింగ్ ఎక్స్పీరియెన్స్ కలిగించేలా రూపొందించారు. పైగా డివోషనల్ కంటెంట్ కావడంతో ప్రేక్షకులలో ఇంకాస్త ఆసక్తి పెరుగుతుంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమా కథ తెలియనిది కాదు. ఇప్పటివరకు చాలా సినిమాల్లో ఈ కథను చూసాము కూడా. భక్త ప్రహల్లాదుడి మోర విని.. బయటకు వచ్చిన నరసింహ అవతారం రాక్షస రాజు.. హిరణ్య కశిపుడిని అంతం చేసే కథ ఇది. పూర్తి కథ మాత్రం 1967 లో వచ్చిన భక్త ప్రహ్లాద సినిమాలోనే చూసి ఉంటారు. ఆ తర్వాత మరోసారి ఈ సినిమా చేసే ప్రయత్నం ఎవరు చేయలేదు. అలాంటి క్లాసిక్స్ ను రీక్రియేట్ చేయాలంటే కచ్చితంగా ప్రేక్షకులను స్క్రీన్ ప్లే తో మెస్మరైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాను యానిమేషన్ రూపంలో తీసుకుని వచ్చారు.
ఇందులో విజువల్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు కూడా స్పెషల్ గా అట్ట్రాక్ట్ చేస్తుంది. సామ్ సిఎస్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. లైవ్ యాక్టర్స్ లేకపోయినా బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ తోనే అవి నిజమైన పాత్రలుగా రూపొందించి టీం సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా మొదటి అరగంట.. అలాగే క్లైమాక్స్ ఈ రెండిటికి ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. సో ఈ సినిమా ఇలానే టాక్ తోనే కంటిన్యూ అయితే మంచి హిట్ అందుకునే అవకాశం లేకపోలేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.