iDreamPost
android-app
ios-app

హోంబాలే ఫిలిమ్స్ కి “మహావతార్” జాక్ పాట్

  • Published Jul 28, 2025 | 10:18 AM Updated Updated Jul 28, 2025 | 10:18 AM

హోంబలే బ్యానర్స్ కు ఈ మధ్య కాలంలో పట్టిందల్లా బంగారమే అవుతుంది. కెజిఎఫ్ , కాంతార సినిమాలతో శాండిల్ వుడ్ ను తారా స్థాయికి చేర్చింది. ఇక ఇప్పుడు మహావతారా నరసింహ రూపంలో ఈ సంస్థకు మరో జాక్ పాట్ తగిలింది. శుక్రవారం రిలీజ్ అయిన యానిమేటెడ్ మూవీ మహావతార నరసింహ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది.

హోంబలే బ్యానర్స్ కు ఈ మధ్య కాలంలో పట్టిందల్లా బంగారమే అవుతుంది. కెజిఎఫ్ , కాంతార సినిమాలతో శాండిల్ వుడ్ ను తారా స్థాయికి చేర్చింది. ఇక ఇప్పుడు మహావతారా నరసింహ రూపంలో ఈ సంస్థకు మరో జాక్ పాట్ తగిలింది. శుక్రవారం రిలీజ్ అయిన యానిమేటెడ్ మూవీ మహావతార నరసింహ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది.

  • Published Jul 28, 2025 | 10:18 AMUpdated Jul 28, 2025 | 10:18 AM
హోంబాలే ఫిలిమ్స్ కి “మహావతార్” జాక్ పాట్

హోంబలే బ్యానర్స్ కు ఈ మధ్య కాలంలో పట్టిందల్లా బంగారమే అవుతుంది. కెజిఎఫ్ , కాంతార సినిమాలతో శాండిల్ వుడ్ ను తారా స్థాయికి చేర్చింది. ఇక ఇప్పుడు మహావతారా నరసింహ రూపంలో ఈ సంస్థకు మరో జాక్ పాట్ తగిలింది. శుక్రవారం రిలీజ్ అయిన యానిమేటెడ్ మూవీ మహావతార నరసింహ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. హరి హర వీరమల్లు సినిమా ఉండగా ఈ సినిమా దిగడంతో పెద్దగా దీనిని ఎవరు పట్టించుకోరేమో అనే ఓ వర్గం వారు అనుకున్నారు. నిజానికి ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా సినిమా మీద అంత బజ్ ఏమి లేదు. కానీ మొదటి రోజు దాటినా తర్వాత స్లో స్లో గా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. కొన్ని గంటల వ్యవధిలో సీన్ రివర్స్ అయింది.. వీకెండ్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. హౌస్ ఫుల్ బోర్డులతో థియేటర్స్ దర్శనమిస్తున్నాయి.

కంటెంట్ బావుంటే ఇలా గంటల వ్యవధిలో సీన్ రివర్స్ అవుతుందని ఇప్పటికే చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ఈ సినిమా కూడా అయింది. ముఖ్యంగా సినిమాలలో ఫస్ట్ హాఫ్ లో మొదటి నలభై నిముషాలు , ఆఖరి అరగంట చూస్తే కచ్చితంగా టికెట్ వర్త్ మూవీ అని అనిపించుకోవడం ఖాయం. పెట్టిన ప్రతి పైసా కు న్యాయం చేసేలా కథను అద్భుతంగా చూపించారు మేకర్స్. అందరికి తెలిసిన కథే అయినా.. మాస్ ఎలివేషన్స్, ఇచ్చి నరసింహ అవతారంలో శ్రీ మహావిష్ణువు హిరణ్య కశిపుడిని చంపే ఎపిసోడ్ కు ఒక్కొక్కరికి గూస్బంప్స్ రావడం ఖాయం.

సినిమాలో ప్రతిదీ ప్రేక్షకులను బాగా మెప్పించింది. అసలు ఎలాంటి అంచనాలు లేని సినిమాకు.. రిలీజ్ అయిన గంటల వ్యవధిలో ఇలాంటి సూపర్ హిట్ టాక్ సంపాదించుకోవడం అనేది.. చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే హోంబలే ఫిలిమ్స్ ఈ ఫ్రాంచైస్ లో వరుసగా ఏడు సినిమాలను అనౌన్స్ చేసింది. దానిలో మొదటి దానికి ఈ రేంజ్ లో సక్సెస్ రావడంతో మిగిలిన వాటి కోసం కూడా ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అటు మేకర్స్ కు కూడా రాబోయే సినిమాలను ఇంకాస్త కొత్తగా తీయాలనే ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక వీక్ డేస్ లో ఈ సినిమాకు ఎలాంటి పిక్ అప్ ఉంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.