iDreamPost
iDreamPost
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మెగాస్టార్ 152వ సినిమా ఆచార్య వ్యవహారాలే ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు అప్పుడే 153 గురించిన అప్డేట్స్ బయటికి వచ్చేస్తున్నాయి. మొన్నటిదాకా వంశీ పైడిపల్లి పేరు వినిపించింది. ఆ తరువాత వివి వినాయక్ అన్నారు. ఇద్దరికీ లూసిఫర్ రీమేక్ ఆఫర్ చేశారనే టాక్ బలంగా ప్రచారమయ్యింది. అయితే తాజాగా వస్తున్న సమాచారం మేరకు ఇప్పుడు చిరు ఫ్రెష్ స్క్రిప్ట్ కోసం చూస్తున్నారట. నేను లోకల్ రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ చెప్పిన లైన్ నచ్చడంతో దాని మీద ప్రస్తుతం వర్క్ జరుగుతున్నట్టు లేటెస్ట్ అండ్ హాటెస్ట్ న్యూస్.
ఒకవేళ ఫుల్ స్క్రిప్ట్ కనక చిరుకి నచ్చితే దర్శకుడిగా వినాయక్ వైపే మొగ్గు చూపుతున్నారని తెలిసింది. ఠాగూర్, ఖైదీ నెంబర్ 150తో రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్న వినాయక్ కు హ్యాట్రిక్ కొట్టడానికి ఇంత కన్నా గోల్డెన్ ఛాన్స్ దొరకదు. ఇదంతా ఖరారు కావడానికి కావడానికి కొంత టైం అయితే పడుతుంది. ఆచార్య షూటింగ్ గురించిన క్లారిటీ వచ్చాక దీని గురించిన ఆలోచన చేయబోతున్నారు. ఇక్కడ మరో విశేషం ఉంది. చాలా ఏళ్ళ తర్వాత చిరంజీవి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారట. ముప్పై ఏళ్ల క్రితం వచ్చిన ఎస్పి పరశురాం తర్వాత చిరు మళ్లీ ఈ వేషం ట్రయ్ చేయలేదు.
ఖాకీ డ్రెస్ లో చిరుకు రక్త సింధూరం, జ్వాల, ముగ్గురు మొనగాళ్ళు లాంటి హిట్సు ఉన్నాయి, స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ లాంటి డిజాస్టర్లు వచ్చాయి. ఇండస్ట్రీ హిట్ అయితే ఈ గెటప్ లో లేదు. ఇప్పుడు మరి ప్రసన్న ఎలాంటి కథ చెప్పాడోనన్న ఆసక్తి అభిమానుల్లో మొదలవుతుంది. ఒకవేళ కార్యరూపం దాలిస్తే దీన్ని గీతా ఆర్ట్స్ భాగస్వామ్యంలో రామ్ చరణ్ నిర్మించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా యూత్ ఫుల్ స్టోరీస్ మాత్రమే రాసిన ప్రసన్న కుమార్ నిజంగా మెగాస్టార్ రేంజ్ సబ్జెక్ట్ చెప్పి ఒప్పించాడా లేదా అనేది ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. ఇది మిస్ అయినా వినాయక్ కు లూసిఫర్ రీమేక్ ఆప్షన్ ఎలాగూ రెడీగా ఉంటుంది కాబట్టి టెన్షన్ ఉండదు. అయితే కొరటాల శివనే రెండేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. వినాయక్ ది అంత ఈజీగా తెరకెక్కుతుందా. వేచి చూద్దాం.