Idream media
Idream media
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా సముద్ర తీర ప్రాంతానికి చైనా అక్షరాలతో కూడిన ఓ వస్తువు కొట్టుకు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతానికి సిలిండర్ ఆకారంలో ఉన్న ఓ వస్తువు వచ్చింది. ఆ వస్తువు పై చైనా భాషలో అక్షరాలు ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వస్తువును చూసిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు.
కరోనా వైరస్ చైనాలోని వూహాన్ నగరానికి సమీపంలో ఉన్న వైరాలజీ ల్యాబ్లో తయారయిందన్న అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. వైరస్ పుట్టుక, దాని ప్రభావం పై చైనా అనేక అంశాలను దాచి పెట్టిందని ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా ఆరోపిస్తోంది. ఈ అంశాలపై ఇప్పటికే అమెరికా దర్యాప్తు మొదలుపెట్టింది. అగ్రరాజ్యం కావాలనే లక్ష్యంతోనే చైనా ఈ వైరస్ను ప్రపంచం పైకి వదిలిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ పరిణామాలన్నీ ప్రముఖ నటుడు సూర్య నటించిన సెవెన్త్ సెన్స్ సినిమాలో కథాంశాన్ని గుర్తు చేస్తున్నాయి. ఆ సినిమాలో చైనా ఆపరేషన్ రెడ్డి పేరుతో భారత్ పై బయో వరకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చైనా వస్తువులు ప్రకాశం జిల్లా సముద్ర తీర ప్రాంతానికి రావడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. రెండు నెలల కాలంలో చైనా వస్తువులు రావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. గతంలోనూ ప్రకాశం జిల్లా పాకాల, కొత్తపట్నం తిరప్రాంతానికి చైనా వస్తువులు వచ్చాయి. వైరస్ వ్యాప్తి ప్రారంభ సమయం నుంచి వస్తువులు వస్తుండడంతో స్థానిక ప్రజల్లో తీవ్ర అలజడి రేగుతోంది.