iDreamPost
android-app
ios-app

చినరాజప్పా… ఈ ప్రచార యావ ఎందుకప్పా ?

చినరాజప్పా… ఈ ప్రచార యావ ఎందుకప్పా ?

తెలుగుదేశం పార్టీ నాయకుల్లో లేచింది మొదలు ప్రభుత్వాన్ని ఎదో ఒకటి అనాలనే ఆత్రుత కనిపిస్తోంది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి…బయటకొచ్చి క్వారంటైన్ కేంద్రాలను సందర్శించాలంటూ మాజీ హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. దీంతో బయటకొచ్చి ఫోటోలకు పోజులిచ్చే సీఎం కాదు మా జగన్…ఏ సమయంలో ఎలా పనిచేయాలో మా నాయకుడికి తెలుసు అంటూ వైకాపా అభిమానులు బదులిస్తున్నారు.

చంద్రబాబుకు ప్రచారంపై వ్యామోహం జాస్తి. వరదలొచ్చినా, తుపానులొచ్చినా సమహాయం కంటే ముందు ప్రచారం పై ద్రుష్టిపెడతారు. అంతెందుకు సింధు లాంటి క్రీడాకారిణి విజయాలను కూడా తన ప్రచారానికి వాడుకున్న ఘనుడు చంద్రబాబు…! ఆయా సందర్భాల్లో ఆయన చేసే ప్రసంగాలు… కొందరు భజన రాయుళ్లతో పొందే ప్రసంశలు చూస్తుంటే ఆ విషయం ఇట్టే  అర్థవుతుంది. అధినేత నుంచి నేర్చుకున్నారో ఏమో కానీ టీడీపీలోని నేతలకూ ప్రచారంపై మక్కువ ఎక్కువే..! చిన్న పని చేసినా కొండంత ప్రచారం పొందాలనుకుంటారు. కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రచారం కంటే పని మీదే ధ్యాస..! అందుకే కరోనా సమయంలో సొంత ఇమేజ్ ను పెంచుకొనేలా వ్యవహరించకుండా తన పని తాను సైలెంట్గా చేసుకుంటూ పోతున్నారు.

ఇంటి నుంచి పని చేస్తున్నారు…క్యాంపు కార్యాలయంలో సమీక్షలతో సరిపెడుతున్నారు అంటూ విమర్శలు చేసే చినరాజప్ప వంటి నాయకులు ఇక్కడో విషయం గుర్తించాలి. ఇప్పుడు రాష్రం ఎదుర్కొంటున్న సమస్య వరదలో… తుపానో కాదు మహమ్మారి కరోనా….! ఇది ఎక్కడ ముగ్గురు నలుగురు గుమ్మికూడతారా…అని కోరలు చాచి ఎదురుచూస్తోంది. ఇలాంటి సమయంలో సీఎం క్వారంటైన్ కేంద్రాలు…జిల్లా పర్యటనలు అంటూ తిరిగితే కరోనా కట్టడికి ఉపయోగపడకపోగా…వైద్య సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. ఇది గుర్తించే వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు వీడియో సమీక్షలతో జిల్లా, రాష్ర్టయంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. అత్యవసరం అనుకుంటే జిల్లాల్లోనూ పర్యటిస్తారు.

అయినా కరోనా విపత్తును ఎదుర్కోవాలంటే రాజకీయ నాయకులు వెనక సీట్లో కూర్చుని.. హెల్త్ డిపార్ట్మెంట్ ను పూర్తి స్థాయిలో పనిచేయనీయాలి. అప్పుడే వైరస్ మహమ్మారిని ఎదుర్కోగలం. ఈ సమయంలో గానీ చంద్రబాబు సీఎంగా ఉండుంటే డాక్టర్లు, ఇతర హెల్త్ వర్కర్ల కంటే తానే ఎక్కువగా వైరస్ తో పోరాడుతున్నట్లు నటించి…నమ్మబలికే వారనడంలో సందేహం లేదు. అయినా ఇలాంటి సమయాల్లో ఎక్కడ నుంచి పనిచేశాము అనేదానికంటే ఎంత బాగా పనిచేశామ్ అన్నదే ముఖ్యం..!