iDreamPost
iDreamPost
చంద్రబాబునాయుడు రెండో కంటికి కూడా సమస్య వచ్చే లాగే ఉంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ప్రవచించిన రెండు కళ్ళ సిద్ధాంతం గురించి అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజన నేపధ్యంలో తెలంగాణా, ఏపి రెండూ రెండు కళ్ళలాంటివంటూ అప్పట్లో సొల్లు కబుర్లు చెప్పాడు. ఒకవైపు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి మరోవైపు తనకు రెండు రాష్ట్రాలూ కావాల్సినవే అని ఇచ్చిన స్టేట్మెంట్ చాలా పాపులరైంది.
సరే విభజన జరగటం, తర్వాత పరిణామాల్లో తెలంగాణాలో టిడిపి దాదాపు కనుమరుగైపోవటం అందరూ చూస్తున్నదే. అంటే చంద్రబాబు పరిభాషలో చెప్పినట్లుగా ఒక కన్ను పోయినట్లే. ఇక ఇపుడు రెండోకంటికి కూడా సమస్య మొదలైంది. మొన్నటి ఎన్నికల్లో తగిలిన దెబ్బకు ఉన్న రెండో కన్ను కూడా దాదాపు దెబ్బ తినేసినట్లే. ఇప్పుడు సమస్య ఏమిటంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ స్కీమ్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగు నీటిని అందించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించాడు.
జగన్ నిర్ణయంపై తెలంగాణా సిఎం కేసీయార్ మండిపోతున్నాడు. ప్రభుత్వం జారీ చేసిన జీవో పై కోర్టుకెళతామని కూడా కేసీయార్ ప్రకటించాడు. అంటే ఎత్తిపోతల పథకం నిర్మాణం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంటోంది. మరి ఇటువంటి సమయంలో చంద్రబాబు ఏమి చేస్తాడు ? అన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది. తెలంగాణాలో ప్రతిపక్షాలు కేసీయార్ కు మద్దతుగా మాట్లాడుతున్నాయి. మరి ఏపిలో ప్రతిపక్షాలు ఏమి చేయాలి ?
రాష్ట్ర ప్రయోజనాల ప్రకారమైతే సహజంగానే జగన్ కు మద్దతుగా నిలవాలి. కానీ జగన్ కు మద్దతుగా అంటే కేసీయార్ వైఖరిని వ్యతిరేకించటం చంద్రబాబుకు ఇష్టం ఉన్నట్లు లేదు. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న ఇళ్ళు, ఆస్తులు, వ్యాపారాలు, ’ఓటుకునోటు’ కేసు కారణంగా కేసీయార్ కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు చంద్రబాబు భయపడుతున్నాడు. జగన్ కు మద్దతు ఇవ్వలేదంటే పరోక్షంగా తెలంగాణాకు మద్దతు పలికినట్లే.
సో ’ఈ లెక్కన చూసుకుంటే చంద్రబాబుకు ఉన్న రెండో కన్ను కూడా మూసుకుపోయే ప్రమాదంలో పడినట్లే అనుకోవాలి. మరి వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి జగన్ కు మద్దతుగా నిలుస్తాడో లేకపోతే కేసీయార్ కు భయపడి రెండో కన్ను కూడా శాస్వతంగా పోగొట్టుకుంటాడో చూడాల్సిందే.