iDreamPost
android-app
ios-app

కోటి రూపాయలు సరిపోతుందా? ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు..

కోటి రూపాయలు సరిపోతుందా? ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు..

‘‘గోదావరి పుష్కరాల్లో ఏం తప్పు జరిగిందండి?.. కొందరు చనిపోయారు.. కుంభమేళాలో చనిపోలేదా? జగన్నాథ చక్రాల కింద పడి చనిపోలేదా? బస్సు ప్రమాదాల్లో చనిపోలేదా?’’ సీఎంగా ఉండగా చంద్రబాబు నిర్లక్ష్యపు మాటలు ఇవి. వాస్తవానికి గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట కేవలం చంద్రబాబు ప్రచార పిచ్చివల్లే జరిగిందనేది జగమెరిగిన సత్యం. వీఐపీ ఘాట్‌లో పుష్కర స్నానం చేసే అవకాశం ఉన్నప్పటికీ బోయపాటి దర్శకత్వంలో డ్యాక్యుమెంటరీ కోసం సాధారణ ఘాట్‌కు సీఎం కుటుంబం వెళ్లడం, ఆ తర్వాత గేట్లను ఒక్కసారి తీయడంతో ప్రజలు భారీగా రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 29 మంది చనిపోయారు. ఆ కుటుంబాలకు ప్రకటించిన పరిహారం ఎంతో తెలుసా? కేవలం పది లక్షలు. ప్రకటించిన తర్వాత రెండేళ్లకు గానీ పరిహారం ఆ కుటుంబాలకు దక్కలేదు. అది కూడా ఎన్నో సార్లు కలెక్టరేట్ల చుట్టూ తిరిగితే ఆ పరిహారంలో 50 శాతం ఇచ్చారు.

ఇప్పుడు సీన్‌ కట్ చేస్తే..

విశాఖలో గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో పది మంది చనిపోయారు. ఆ విషయం తెలిసిన వెంటనే సీఎం జగన్‌ అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించి, దేశంలో ఎక్కడా లేని విధంగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ప్రకటించారు. వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నవారికి పది లక్షలు, రెండు మూడు రోజులు చికిత్స తీసుకుంటున్న వారికి లక్ష, ప్రాథమిక చికిత్స పొందినవారికి 25 వేలు, చుట్టు పక్కల గ్రామాల్లోని 15 వేల మందికి పది వేల చొప్పున ప్రకటించారు. మరుసటి రోజే రూ. 30 కోట్లు విడుదల చేశారు. దీనిపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. 

ఒక్క చంద్రబాబు మాత్రం విషం చిమ్మడం మొదలుపెట్టారు. కోటి రూపాయల సాయం ఏం సరిపోతుందంటూ? మతిస్థిమితం కోల్పోయిన వాడిలా మాట్లాడుతున్నారు. అసలు ఎక్స్‌గ్రేసియా ఎవరు ఇమ్మన్నారంటూ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. తద్వారా ఎన్ని సంక్షోభాల్లోనైనా తనకు రాజకీయాలు తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టవని మరోసారి నిరూపించుకున్నారు. తాను చేయని పనులను జగన్‌ చేస్తుండడంతో ఈర్ష్య, అసూయలతో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తాను అధికారంలో ఉండగా జరిగిన ప్రమాదాల్లో బాధితులను చంద్రబాబు ఆదుకోలేదని, ఇచ్చిన అరకొర పరిహారం కోసం ముప్పుతిప్పలు పెట్టారని గుర్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా పలు సందర్భాలను ఉదహరిస్తున్నారు.

నగరం ఘటనలో 3 లక్షలే బాబు పరిహారంచంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే.. 2014 జూన్‌ 27న తూర్పుగోదావరి జిల్లాలోని మామిడికుదురు మండలంలో నగరం అనే గ్రామంలో గ్యాస్‌ పైప్‌ విస్పోటం జరిగింది. ఈ ఘటనలో 22 మంది చనిపోగా, 18 మంది గాయపడ్డారు. అప్పట్లో మృతులకు గెయిల్‌ సంస్థ 15 లక్షలు, కేంద్రం 2 లక్షలు ఇవ్వగా, చంద్రబాబు ప్రభుత్వం రూ. 3 లక్షలు ఇచ్చింది. ఆ ఘటనకు తమకు సంబంధం లేనట్లు వ్యవహరించింది.

అలాగే 2017లో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదిలో బోటు మునిగి 21 మంది చనిపోయారు. వరద ఉన్నా బోటును అనుమతించిన ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్పష్టమైంది. అప్పట్లో బాధిత కుటుంబాలకు పది లక్షలు ప్రకటించి.. తూతూమంత్రంగా ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. 2018లో గోదావరిలో బోటు మునిగి 22 మంది చనిపోగా పది లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇలా అనేక ఘటనల్లో చంద్రబాబు తూతూ మంత్రంగానే సహాయం అందించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు.. కోటి రూపాయలు ఇచ్చిన సీఎం జగన్‌పై విమర్శలు చేయడంపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలు చేసుకోవడానికి ఎన్నో సందర్భాలు ఉంటాయని, కానీ మంచి పనులు చేసినప్పుడు స్వాగతించినప్పుడే ప్రజల్లో సానుకూలత వస్తుందని పేర్కొంటున్నారు.