iDreamPost
iDreamPost
నిన్న డిస్నీ హాట్ స్టార్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా భుజ్ ది ప్రైడ్ అఫ్ ఇండియా. ట్రైలర్ దశ నుంచి విపరీతమైన ఆసక్తి రేపిన ఈ వార్ డ్రామాలో అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా లాంటి స్టార్ క్యాస్టింగ్ ఉండటంతో వ్యూస్ కూడా రికార్డులు నమోదు చేస్తాయనే నమ్మకం బలంగా నెలకొంది. అందులోనూ ఇండిపెండెన్స్ డే సెంటిమెంట్ కూడా కలిసొచ్చేలా డేట్ ని సెట్ చేయడంతో ప్రేక్షకులు సైతం ఎదురు చూశారు. నిన్న ఉదయం నయనతార నేత్రికన్ ని ప్రీమియర్ చేసిన హాట్ స్టార్ సాయంత్రానికి భుజ్ ని స్ట్రీమింగ్ చేసింది. మరి ఇంత హైప్ తో వచ్చిన ఈ పీరియాడిక్ డ్రామా ఎలా ఉందొ రిపోర్ట్ లో చూద్దాం.
కథా నేపథ్యంలో 1971లో సాగుతుంది. భారతదేశం నుంచి బంగ్లాదేశ్ విడిపోయేందుకు ఇండియా సహకరిస్తోందన్న దుగ్ధతో ఉన్న పాకిస్థాన్ దాని కోసం ముప్పై లక్షల అమాయక ప్రాణాలు బలి కావటానికి కారణం అవుతుంది. అంతటితో సంతృప్తి చెందక మన దేశం మీద వైమానిక దాడులతో పాటు ఇతరత్రా మార్గాల్లో యుద్ధం చేసేందుకు పన్నాగాలు పన్నుతుంది. ఈ క్రమంలో మొదటి అడుగుగా భుజ్ ఎయిర్ బేస్ మీద అటాక్ చేసి దాన్ని నాశనం చేస్తుంది. వేలాది సైనికులను తీసుకుని దొంగ దారిలో విష వలయం సిద్ధం చేసుకుంటుంది. ఇది తెలుసుకున్న భారత సైన్యం దీన్ని ఎలా తిప్పి కొట్టిందన్నదే అసలు స్టోరీ.
మంచి లైన్ తీసుకున్నప్పటికీ దర్శకుడు అభిషేక్ దుదయ్య గ్రాండియర్ విజువల్స్ మీద పెట్టిన శ్రద్ధ కథా కథనాల మీద పెట్టకపోవడంతో ఎక్కడా ఎమోషన్ రిజిస్టర్ కాక భుజ్ మొదలైన కాసేపటికే మహా బోర్ గా సాగుతుంది. కళ్ళు చెదిరేలా సెటప్ ఉన్నప్పటికీ అది కనీస స్థాయిలో కాపాడలేకపోయింది. అజయ్ దేవగన్, సంజయ్ దత్ లు సైతం ఒకదశ దాటాక నిస్సహాయులుగా మిగిలిపోయారు. గూస్ బంప్స్ లాంటి సన్నివేశాలు ఉండాల్సిన చోట చాలా సాధారణంగా జరిగిపోవడం నిరాశ పరుస్తుంది. ఇంతేసి ఖర్చు వృథా పోవడం ముమ్మాటికీ డైరెక్టర్ తప్పే. కేవలం ఆర్ట్ వర్క్ కోసం తప్ప భుజ్ చూసేందుకు మరో కారణం లేదు
Also Read : నేత్రికన్ రివ్యూ