iDreamPost
android-app
ios-app

పెళ్లయిన 10 రోజులకే ప్రెగ్నెన్సీ.. నటి ఇచ్చిన రిప్లై చూస్తే నవ్వు ఆపుకోలేరు!

  • Published Jul 06, 2024 | 8:34 AM Updated Updated Jul 06, 2024 | 8:34 AM

Bollywood Actress: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సినీ సెలబ్రెటీలకు తల నొప్పి మొదలైంది. మంచి కన్నా చెడు వార్తలు క్షణాల్లో వైరల్ కావడం.. వాటిపై సదరు నటులు క్లారిటీ ఇవ్వడం సర్వ సాధారణం అయ్యింది.

Bollywood Actress: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సినీ సెలబ్రెటీలకు తల నొప్పి మొదలైంది. మంచి కన్నా చెడు వార్తలు క్షణాల్లో వైరల్ కావడం.. వాటిపై సదరు నటులు క్లారిటీ ఇవ్వడం సర్వ సాధారణం అయ్యింది.

  • Published Jul 06, 2024 | 8:34 AMUpdated Jul 06, 2024 | 8:34 AM
పెళ్లయిన 10 రోజులకే ప్రెగ్నెన్సీ.. నటి ఇచ్చిన రిప్లై చూస్తే నవ్వు ఆపుకోలేరు!

ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూసి నవ్వాలో.. ఏడ్వాలో తెలియని పరిస్థితి. ఇదిగో పులి అంటే.. అదిగో తోక అనే చందంగా సాగుతుంది. ముఖ్యంగా సెలబ్రెటీలకు సంబంధించిన నెగిటీవ్ వార్తలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తమపై వస్తున్న పుకార్లపై సదరు నటీనటులు మీడియాతో క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలకు శుభం కార్డు పడుతుంది.  బాలీవుడ్‌లో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఇటీవల తాను ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఓ నటి పది రోజులకే గర్భం దాల్చిందంటూ వస్తున్న నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వార్తలపై నటి సీరియస్ కాకుండా ఫన్నీగా సమాధానం ఇవ్వడంతో ఆ వార్త కూడా వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ నటి ఎవరు? ఏం సమాధానం ఇచ్చింది? పూర్తి వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ స్టార్ నటుడు, రాజకీయ నేత శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా గత నెల 23న తాను ప్రేమించిన ప్రియుడు జహీర్ ఇక్బాల్ ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరు ఏడేళ్లుగా సహజీవనం చేస్తూ పెళ్లి చేసుకున్నారు. ఎంతో గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చి ఓ ముస్లిం ని పెళ్లి చేసుకుంటావా అంటూ సోనాక్షిపై విమర్శలు వెల్లువెత్తాయి.. మతం కన్న ప్రేమే నాకు గొప్పది అందుకే పెళ్లి చేసుకున్నా అంటూ విమర్శలను తిప్పి కొట్టింది సోనాక్షి. జహీర్ కూడా నటుడే..‘డబుల్ ఎక్స్‌ఎల్’ మూవీలో నటించాడు. ఇదిలా ఉంటే నటి సోనాక్షి సిన్హా గర్భవతా? అంటూ బి టౌన్ లో వార్తలు రెండు మూడు రోజులుగా తెగ వైరల్ అవుతున్నాయి.

Sonakshi Sinha

ప్రముఖ న్యూస్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ సరదాగా స్పందించింది. సోనాక్షి సిన్హా మాట్లాడుతూ.. ‘జీవితం మనం అనుకున్నంత గొప్పగా ఉండదు.. నాకు పెళ్లైన తర్వాత జీవితంలో పెద్ద మార్పులేమీ జరగలేదు. ఇప్పుడు ఎలా ఉందో.. పెళ్లికి ముందు కూడా అలాగే ఉంది. ఇప్పుడు నేను నా భర్త హ్యాపీగానే ఉన్నాం.. త్వరలో షూటింగులు మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఒక్క మార్పు ఏంటంటే.. ఇక నుంచి నేను నా భర్త హాస్పిల్ వైపు అస్సలు వెళ్లం. ఎందుకంటే మేమిద్దరం కలిసి హాస్పిటల్ కి వెళ్తే నాకు ప్రెగ్నెన్సీ అని అందరూ అనుకుంటున్నారు.. ఆ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి’ అంటూ నవ్వుతూ చెప్పింది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio