iDreamPost
android-app
ios-app

Prabhas: అజయ్ దేవగణ్ సినిమాలో ప్రభాస్? ఆ పోస్ట్ తో డైరెక్టర్ హింట్ ఇచ్చాడా?

  • Published Sep 03, 2024 | 4:20 PM Updated Updated Sep 03, 2024 | 4:20 PM

Prabhas cameo role in Ajay Devgn's Singham Again movie: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించబోతున్నాడు అనే వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. సింగం అగైన్ చిత్రంలో డార్లింగ్ కనిపించబోతున్నాడట. ఆ వివరాల్లోకి వెళితే..

Prabhas cameo role in Ajay Devgn's Singham Again movie: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించబోతున్నాడు అనే వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. సింగం అగైన్ చిత్రంలో డార్లింగ్ కనిపించబోతున్నాడట. ఆ వివరాల్లోకి వెళితే..

Prabhas: అజయ్ దేవగణ్ సినిమాలో ప్రభాస్? ఆ పోస్ట్ తో డైరెక్టర్ హింట్ ఇచ్చాడా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ‘కల్కి’ సినిమాతో హాలీవుడ్ రేంజ్ లో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అయితే పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ.. ఇప్పటి వరకు ప్రభాస్ బాలీవుడ్ మూవీలో నటించలేదు. కానీ.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డార్లింగ్ బాలీవుడ్ మూవీలో క్యామియో రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో అజయ్ దేవగణ్ నటిస్తున్న చిత్రం ‘సింగం అగైన్’. ఈ చిత్రంలో ప్రభాస్ కనిపించబోతున్నాడు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. దీనికి కారణం డైరెక్టర్ పెట్టిన ఓ పోస్టే. అందులో ఏముందంటే?

ప్రభాస్.. బాలీవుడ్ మూవీలో నటించబోతున్నాడు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. అజయ్ దేవగణ్-రోహిత్ శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘సింగం అగైన్’. ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ ఓ క్యామియోను చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలు జోరందుకోవడానికి కారణం డైరెక్టర్ రోహిత్ శెట్టి పెట్టిన ఓ పోస్ట్. తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో అతడు ఈ సినిమాలో అతిథి పాత్ర చేసే హీరోను ఉద్దేశిస్తూ వీడియోను పోస్ట్ చేశాడు. “ఈ హీరో లేకపోతే సింగం అగైన్ అసంపూర్తిగా ఉంటుంది. స్కార్పియోలోని నటుడు దీపావళికి సందడి చేస్తాడు. కానీ ఓ ట్విస్ట్” అంటూ రాసుకొచ్చాడు.

అయితే రోహిత్ శెట్టి పోస్ట్ చేసిన ఈ వీడియోకి బ్యాగ్రౌండ్ స్కోర్ గా ‘కల్కి’ థీమ్ మ్యూజిక్ ను వాడాడు. దాంతో స్కార్పియోలో ఉంది యంగ్ రెబల్ స్టార్ ప్రభాసే అని అందరూ అనుకుంటున్నారు. డైరెక్టర్ ఇలా కావాలనే హింట్ ఇచ్చాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. డార్లింగ్ ఇందులో క్యామియో చేస్తే.. ఆ సినిమాకు నిజంగా అది ప్లస్ పాయింటే అవుతుంది. ఎందుకంటే ప్రభాస్ కు పాన్ ఇండియా రేంజ్ లో ఉన్న ఫాలోయింగ్, పైగా కల్కి సక్సెస్ అజయ్ దేవగణ్ సినిమాకు బాగా ఉపయోగపడుతుంది. కానీ.. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే మరికొంత మంది ఈ పాత్రలో సూర్య కనిపిస్తాడని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే? ‘సింగం’ సిరీస్ లు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో మనందరికి తెలిసిందే. దాంతో అజయ్ తో కలిసి సూర్య కనిపిస్తాడనే ఊహాగానాలు పెరిగిపోయాయి. మరి నిజంగానే ప్రభాస్ సింగం అగైన్ లో నటిస్తున్నాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Rohit Shetty (@itsrohitshetty)